23, మే 2009, శనివారం

One funny incident

అవి నా 10th క్లాసు వేసవి సెలవల రోజులు. ఖాలిగా వుండటం కంటే, కోచింగ్ కి వెళ్ళటం బెటర్ అని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కి జాయిన్ అయ్యాను. ప్లేస్ మా పిన్ని వాళ్ళ వూరు అవ్వటం తో నేను డే-స్కాలర్ని అయ్యాను.

మా అమ్మ శాంతం ఐతే మా పిన్ని సూర్యకాంతం. బుక్స్, రూల్స్ అని నస పెట్టినా, నేను చేసే అల్లరి మాత్రం మా పేరెంట్స్కి ఎకరువు పెట్టేది కాదు. తనకి ఒక్కటే కూతురు అవ్వటం వల్ల నన్ను సొంత కొడుకు లా చూసుకునేది. బై బర్త్ వచ్చిన బద్ధకం వల్ల నేను క్లాసు కి ఎప్పుడు లేట్గ వెళ్ళేవాడిని, ఇంటికి మాత్రం త్వరగా వచ్చేవాడిని.

ఆ వూరిలో నాకొక ఫ్రెండ్ వుండేవాడు.. వాడు మాకు దూరపు బందువు కూడా. కాని నేను వాడితో సావాసం చెయ్యటం మా పిన్నికి ఏమాత్రం ఇష్టం లేదు. మన పిల్లలు పసివాళ్ళు, పక్కింటి పిల్లలు పోకిరి వాళ్ళు అనుకోవటం ప్రతి తల్లి కి అలవాటు !!!.

తొలకరి కి తొందరపడ్డ వర్షం లా నేను త్వరగా వస్తే, ఎండాకాలం వడగాలి లా వాడు ఎప్పుడు ఇంటి దగ్గరే తిరుగుతూ వుండే వాడు. ఇద్దరం కలిసి ఎండా , వాన తేడ తెలియకుండా క్రికెట్ ఆడేవాళ్ళం. నేను వచ్చింది క్రికెట్ కోసమో, కోచింగ్ కోసమో తెలియక మా పిన్ని కన్ఫుజ్ అయ్యేది.

ఆ ' గాలి ' తో తిరుగుడు భరించలేని మా పిన్ని, చల్లని కోలా నాకు ఇచ్చి,చిన్నగా క్లాసు తను తీసుకుంది. నేను మార్గదర్శి లో చేరాను, మా పిన్ని కి ఒక స్టొరీ చెప్పాను. " భారత దేశం లో టాప్ 10 విష సర్పాల్లో 7 కర్ణాటక లోనే వుంటాయి అంట. అవి కర్ణాటక లోని గంధం చెట్లకు చుట్టుకుని వుంటాయి అంట ఎందుకంటే అక్కడి పాములు, గంధం చెట్లు మంచి ఫ్రెండ్స్ ... ఎన్ని ఎక్కువ పాములు చుట్టుకుని వుంటే, ఆ చెట్టు గంధం అంత మంచిది అని అక్కడి గంధంపు దొంగల నమ్మకం. కాని ఎంత కాలం కలసి వున్నా, ఆ చెట్ల లోని గంధం ఆ పాముల్లోకి రాదు, ఆలాగే పాములోని విషం గంధం లోకి వెళ్ళదు .... అదే విధంగా మన చుట్టూ ఫ్రెండ్స్ ఎలా వున్నా, మనం కరెక్ట్ గ వుంటే ఏమి అవ్వదు" అని చెప్పా. నా స్టొరీ విన్న ఆ తల్లికి గొంతు మూగపోయింది, నా చెల్లి కి వస్తున్నా నిద్ర ఆగి పోయింది.

అప్పటి నుంచి " చూసి వెళ్ళాలి, షూస్ వేసుకేల్లాలి " లాంటి రూల్స్ లేకపోవటం తో నా పని 3 కోచింగ్ క్లాస్స్లు 6 క్రికెట్ మ్యాచ్ లా వుండేది. మా పిన్ని కూడా ' మా అబ్బాయి చాల మంచోడు' అనుకునేది. సడన్ గ మా చుట్టాలబ్బాయి నాకు చుక్కలు చూపించాడు.వాడు ఎవరి మీద రాయి వేసిన దెబ్బ మాత్రం నాకే తగిలేది.... వాడి తప్పులు ... నాకు అప్పులు .... వాడి గొప్పలు .... మాకు తిప్పలు... వాడి పాపాలు... మాకు శాపాలు. ఫలితంగా లైఫ్ లో ఇలాంటి మిత్రుడు పక్కన వుంటే శత్రువులు వుండాల్సిన అవసరం లేదు అనుకునేలా చేసాడు.

కోచింగ్ లో వీక్లీ టెస్ట్లు బోర్ గ వుండేవి... టాప్ 10 రాన్కర్స్ లిస్టు బోర్డు మీద వుండేది. కొన్ని సార్లు నాకు 1st రాంక్ వచ్చేది.... మా సర్ కి మాత్రం క్రాక్ వచ్చేది..నేను చిన్నప్పుడు మంచి వాడిని అని( మా సర్ అండ్ మా పెదన్నాన్న ఫ్రెండ్స్ సో నేను మా సర్ కి చిన్నపాటి నుంచి తెలుసు)... ఈ మధ్య ఎక్ష్త్రాలతొ ఎదవలా అయ్యాను అని ఆయనకు నా మీద చాల కోపం వుండేది అందుకే కనిపించిన ప్రతిసారీ తిడుతూ వుండేవాడు.... అందుకే నేను ఆయనకు కనిపించకుండా తిరుగుతూ వుండేవాడిని.

కోచింగ్ లో నాకు ఒక ఫ్రెండ్ వుండేవాడు... వాడు చాల మంచి వాడు. పది రోజుల్లో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యిపోయాము. అలాగే పద్దు అని ఒక అమ్మాయి వుండేది... అందంగా అమాయకంగా అణకువగా వుండేది... కనిపించినప్పుడు నాకు ఒక స్మైల్ ఇచ్చేది... నాకు ఎవరినా స్మైల్ ఇస్తే ఇష్టం వుండదు అందుకే తన స్మైల్ తనకి తిరిగి ఇచ్చేవాడిని.

ఆ రోజు ఫైనల్ ఎక్షామ్ రాయటానికి విజయవాడ వెళ్ళాము.. ఎక్షామ్ రాసాము...రాంక్ ఎంత వస్తుంది అని మా సర్ అడిగారు.... నేను ఆలోచించి ఐదు వేలు లోపు వస్తుంది అన్నాను....అయన అలోచినకుండానే అక్షింతలు వేసారు.... మా ఫ్రెండ్ ఒకడు వాడికి 100 లోపు వస్తుంది అని చెప్పాడంట... వాడు బాగా రాసాడు అని వాడిని ఎంకరేజ్ చేస్తే భావుండేది.... నన్ను డిస్కరేజ్ చెయ్యటం మాత్రం భాలేదు.... తిడతారు అని చెప్పి ఫ్లాప్ ని హిట్ అని చెప్పలేం కదా ...

తిరిగి వచేటప్పుడు, నేను నా కోచింగ్ ఫ్రెండ్ పక్కనే కూర్చున్నాం. మా ముందు సీట్లో పద్దు కూర్చుంది. ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు వింటూ .... ఆ ఇద్దరు మిత్రులు మేమే అనుకుంటూ... నూటొక్క జిల్లాల్లో పద్దు లాంటి అమ్మాయి లేదు అనుకుంటూ వస్తున్నాము... ఇంతలొ పిడుగులా పద్దు పర్సు నా కాళ్ళ ముందు పడింది. తీసి చూస్తే, తినటానికి ఒక చాకొలేట్, తీసుకోవటానికి ఆరు వందల నోట్లు కనిపించాయి. పనికిరాని వన్ని పర్సు లో పెట్టేసి పద్దుకి వాపసు ఇచ్చేసా. నా టీ-షర్టుకి పాకెట్ లేకపోవటం వల్ల , నావి ఏడు వందలు, పద్దువి ఆరు వందలు కలిపి మొత్తం పదమూడు వందలు నా ఫ్రెండ్ పాకెట్ లోకి వెళ్ళాయి. ఆ తర్వాత నేను నిద్ర పోయాను.

మా ప్లేస్ కి పది కిలోమీటర్ల దూరం లో నా ప్రక్కన కూర్చున్న ఫ్రెండ్ దిగిపోవటానికి నన్ను నిద్ర లేపాడు. వాడు అక్కడ ఇంకో బస్ ఎక్కి వేరే వూరు వెళ్ళాలి. వాడికి బై చెప్పి మళ్ళి పడుకున్నా. మా కోచింగ్ సెంటర్ కి వచ్చాక, హాస్టల్ వాళ్ళు అంతా వెళ్ళిపోవటానికి రెడీ అవుతూ హడావిడగా వుంది. మధ్య మధ్య లో పద్దు కనిపించి నవ్వుతుంది.ఫ్రెండ్ చేంజ్ అడిగితే పాకెట్ లోకి చెయ్యి పెట్టా.... పద్దు ఎందుకు నవ్వుతుందో అప్పుడు అర్థం అయ్యింది. నా మనీ అండ్ పద్దు మనీ కూడా మా ఫ్రెండ్ దగ్గర వుండిపోయాయి.పక్కన వున్న ఫ్రెండ్స్ కి స్టొరీ మొత్తం చెప్పటం కన్నా తనకే చెప్పటం మంచిదని పద్దు వద్ద కు వెళ్ళా.

నన్ను తంతుందో, తిడుతుందో అనుకున్నా... తను మాత్రం నవ్వుతుంది....ఆ టైం లో కూడా తను నవ్వటం నాకు నచ్చింది, అందుకే నేను తన స్మైల్ తిరిగి ఇవ్వలేదు.....తనతో నేను అప్పటి వరకు అసలు మాట్లాడలేదు.మొదటి సారి మొహమాటంగా " డబ్బులు వున్నాయా" అని అడిగా... తను నవ్వుతు డెబ్బయి రూపాయిలు చూపించింది. అందులో యాబయి రూపాయిలు తీసుకుని నలబై నిమిషాల్లో వస్తా అన్నాను... తను " ఈ ఇరవై రుపాయిలతో ఇంటికి వెళ్లిపోవచ్చు" అంది. నేను వచ్చాక, మీరు వెళ్ళొచ్చు అని సైగ చేసి అక్కడనుంచి నేను బస్సు స్టాప్ కి వెళ్ళాను.

నా ఫ్రెండ్ చాల మంచివాడు అని నాకు నమ్మకం... ఆ నమ్మకమే వాడు వాళ్ళ వూరు వెళ్ళకుండా మధ్యలో దిగిన వూరిలోనే మూడు గంటలు నాకోసం బస్ స్టాప్ లోనే వెయిట్ చేస్తాడని ఆశ కలిగించింది. కట్ చేస్తే, 20 నిమిషాల తర్వాత ఆ వూరి బస్ స్టాప్ లో దిగాను.... అప్పటికే ఆకలితో అరటి పళ్ళు తింటున్న వాడిని చూసి చాల ఆనంద పడ్డాను.. వాడికి నా భాద మొత్తం చెప్పి తేలిక పడ్డాను..వాడి దగ్గర డబ్బులు తీసుకుని, తను నేను వెళ్ళేవరకు వుంటుందో వెళ్ళిపోతుందో అని కొంచం టెన్షన్ పడ్డాను... అలా పడుతూ, లేస్తూ వెళ్లి తన డబ్బులతో పాటు వీడ్కోలు కూడా ఇచ్చాను.. నేను బై చెప్పాను అనుకున్నా.... కాని నాకు తరువాత తెలిసింది అది గుడ్ బై అని.

It remains one of the unforgettable funny incident in my life.

1 కామెంట్‌: