5, జూన్ 2009, శుక్రవారం

ప్రయాణం - A trip to Hogenikal

IPL అయ్యిపోయాక, TV లో ఇంటరెస్టింగ్ గా చూడటానికి ఏమి లేక, తేజ ఛానల్ లో తమ్ముడు మూవీ చూస్తున్నా.ఒక సీరియస్ సీన్ వస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ లో 'వేళా పాలా లేకుండా' సాంగ్ వస్తుంటే,నేను వెళ్లి మొబైల్ లో కాల్ అటెండ్ చేశా... కన్ఫుజ్ అవ్వకండి, ఆ సాంగ్ తమ్ముడు మూవీ లోదే అయ్యినా, అప్పుడు వచ్చింది మాత్రం నా మొబైల్ నుంచి. ఎందుకనగా అది నా రింగ్ టోన్ కనుక.

నాకో చిన్నప్పటి ఫ్రెండ్ వున్నాడు....వాడికి నేనంటే ఒక పెద్ద అభిప్రాయం కూడా వుంది... నాకు కొంచం బలుపు అని, అందువల్ల నేను ఫ్రెండ్స్ ని కలవాలి అనుకున్నపుడు, వాళ్ళని నా దగ్గరకు రమ్మంటాను అని, నేను మాత్రం వాళ్ళ
దగ్గరకు రానంటాను అని వీడి నమ్మకం. బద్దకాన్ని, బలుపు అనుకునే అమాయకత్వం వాడిది.

తను కాల్ చేసి,రేపు కలుద్దాం, కలసి హొగెనకల్ వెళ్దాం అన్నాడు... సరే అని కాల్ కట్ చేశా. నార్మల్ గా వీకెండ్ అనగానే, ఒక ఫెవికాల్ బాటిల్ తీసుకుని, కొత్తగా కొన్న కుర్చీ సీట్ కో, లేక నా బెడ్ కాట్ కో పూసుకోవటం నాకు అలవాటు... ఈ వీకెండ్ కి మాత్రం కుర్చీ సీట్ కి, బెడ్ కాట్ కు కాకుండా,నా హార్ట్ కి రాసుకుని, డేఫనేట్ గా వాడితో హొగేనికల్ వెళ్దాం అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యా.

ఈగర్ గా ఎర్లీ మార్నింగ్ లేచి, హడావిడి గా రెడీ అయ్యి,మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పులేసుకుని,చెప్పిన చోటకి వెళ్ళాను..నేను వెళ్ళిన కొంచం సేపటికి మా ఫ్రెండ్ వచ్చాడు...తను తమిళనాడు తరలి వెళ్ళటంతో తనని కలసి చాల కాలం అయ్యింది... నన్ను చూడగానే సినిమా హీరో లా వున్నావురా అన్నాడు. తమిళనాడు లో వుంటున్నాడు
కదా, పితామగన్(తెలుగు లో శివపుత్రుడు ), సుబ్రమణ్యపురం(తెలుగు లో అనంతపురం) లాంటి సైకో సినిమా ఏదో తీసే ప్లాన్ లో వున్నాడేమో అనుకున్నా.

మిగిలిన ఫ్రెండ్స్ తో పరిచయాలు ఐన తర్వాత, మొత్తం 8 మంది కలసి జోరుగా జర్నీ స్టార్ట్ చేసాము...కింగ్ ఫిషర్ ఫ్లైట్ ప్రయాణం లో ప్రికాషన్స్ ఇస్తున్న మాల్యా లా, మా ఫ్రెండ్ తన రైడింగ్ గురుంచి రూల్స్ చెప్పాడు. ఎంతైనా మా ఫ్రెండ్ ది విశాల హృదయం. వాడు ఎలాంటి రోడ్ మీద ఐన ఒకేలా రైడ్ చేస్తాడు. గుంటల్ని, గుట్టల్ని సమానంగా చూసే సహృదయుడు వాడు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ కాకుండా స్పీడ్ మాత్రమే వాడతాడు. బైక్ కి కూడా సీట్ బెల్ట్ అవసరం అనుకునేలా చేసాడు వీడు.

మా ఫ్రెండ్ మంచితనానికి ముచ్చటపడి ముద్దు పెట్టుకోవాలనుకుందేమో, సిల్క్ బోర్డ్ రోడ్ స్లిప్ చేసింది. ఆ స్కిడ్డింగ్ కి ఇద్దరం రోడ్ కి అడ్డంగా పడ్డాం. తగిలిన దెబ్బలు చిన్నవే అవ్వటంతో అవి పెద్ద భయాన్ని మాత్రం క్రియేట్ చెయ్యలేదు. ఐనా నాది మాములు హార్ట్ కాదు కదా.... ఫెవికాల్ రాసుకున్న హార్ట్. అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది, మేము హొగెనకల్ చేరటానికి చేసేది ప్రయాణం కాదు ప్రయత్నం మాత్రమే అని.

అలా మొదలై, అత్తిబలి దాటాక ఆకలి అనిపిస్తే తమిళ్నాడు లో అడుగు పెట్టాక టిఫ్ఫెన్ తిన్నాము. నల్ల రంగు లో రోడ్సు,
నీలి రంగులో క్లౌడ్సు, పచ్చ రంగులో ప్లాంట్స్ తో ప్రతి సీన్ ఒక సీనరి లా ఓవర్ ఆల్ గ గ్రీనరీ లా అనిపించింది.అలాంటి ప్రశాంతమైన వాతావరణం లో పరుగులు పెడుతున్న వాహనాలపై వెళ్తూ,అలుపు అనిపించినప్పుడు అనుకూలమైన ప్లేస్ లో ఆగుతూ,ఆగిన చోట ఫోటోలు దిగుతూ మా పయనం సాగించాము.ఘాట్ రోడ్లు,గతుకుల రోడ్లు దాటి హొగేనికల్ చేరాము.

ఒక హోటల్ (పేరు తమిళనాడు)కి వెళ్లి భోజనం చేసాము.మార్నింగ్ టిఫ్ఫెన్,మధ్యానం మీల్స్ తర్వాత నాకు 2 విషయాలు అర్థం అయ్యాయి. (మొదటది), తమిళ్ హోటల్స్ లో సాంబార్ భావుంటుంది అని, ( రెండోది), సాంబార్
మాత్రమే భావుంటుంది అని.ఆ తర్వాత చిన్నపాటి తెప్పలు 2 తీసుకుని ఫాల్స్ చూడటానికి స్టార్ట్ అయ్యాము. ఆ తెప్పలు నడిపేవాడు మాకు కర్ణాటక ఫాల్స్,తమిళనాడు ఫాల్స్ చూపిస్తాను అంటే,అవి ఎంత దూరమో అనుకున్నాము,అక్కడకి వెళ్లి చూసాక తెలిసింది,పక్క పక్కనే వున్న ఫాల్స్ ని ఈ పక్క రాష్ట్రాల వాళ్ళు పంచుకున్నారు అని.

ఆ జలపాతం కిందకి వెళ్ళినప్పుడు,మా తాపం తీరేలా వాటర్ మీద పడుతుంటే అద్భుతం లా అనిపించింది.అక్కడ కొండల మీద నుంచి కాలువ లోకి దూకుతున్న పిల్లల్ని చూసి ఆశ్చర్యం అనిపించింది.ఆ పక్కనే వున్న ఐ-ల్యాండ్ లోకి వెళ్లి,వాటర్ లో ఆడుకుంటూనపుడు అనందం గా అనిపించింది.అలా ఒక గంట ఆడాక అలసట గా అనిపించింది.అటు వెళ్లి మెయిన్ ఫాల్స్ ని చూసినప్పుడు అమేజింగ్ అనిపించింది.

అలా అన్నిరకాల అనుభూతుల్ని మూట కట్టుకుని, తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. మధ్యలో కురిసిన వర్షంతో మా అందరి మీద నీళ్ళు కారాయి కాని మా ఆనందం మాత్రం నీరు కారలేదు. ఆ చిరు జల్లుల్లో సేఫ్ గా రూం కి చేరటంతో మా హొగెనకల్ ప్రయాణం(పయత్నం) పూర్తి అయ్యింది.

2 కామెంట్‌లు:

  1. bussu babai, nilo enta telugu command vundani teliyadu.. anyway keep continuing.. enjoy

    రిప్లయితొలగించండి
  2. హాయ్ నాగ రాజు ..బాగుంది చాలా బాగా రాసారు ...
    నాకు ఈ ప్రాసలు బాగా నచ్హాయి
    1." ప్రతి సీన్ ఒక సీనరి లా ఓవర్ ఆల్ గ గ్రీనరీ లా అనిపించింది."
    2.గుంటల్ని, గుట్టల్ని సమానంగా చూసే సహృదయుడు వాడు.
    అన్నట్టు ఈ ప్రయాణంపై నా బ్లాగులని కూడా చూడండి
    తెలుగులో
    ఇంగ్లీషులో

    రిప్లయితొలగించండి