11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

Hats off to you YSR

No... I am not fan of YSR...... "కడప లో బాంబుల రెడ్డి మల్లి గెలిచాడు". తెలుగు దేశం ప్రబంజనం లో కాంగ్రెస్ హేమాహేమీలు కూడా ఓడిపోయినప్పుడు, అభిమానులు "పులివెందుల పులి" గా పిలుచుకునే ఆ వ్యక్తి గురుంచి ఈనాడు పేపర్ లో రాసిన ఆర్టికల్ చదువుతూ మా వూరిలో పెద్ద వాళ్ళు అనుకుంటూ వుండగా నేను మొదటి సారి YSR గురుంచి చదివాను....( అప్పుడు నేను 4th క్లాసు చదువుతున్నాను..... అర్థం అయ్యినా, అవ్వక పోయినా , రోజూ news paper చదవాలి అనేది మా ఫాదర్ నాకు పెట్టిన రూల్.). అప్పట్లో చిరంజీవి (కొండవీటి దొంగ, కొదమ సింహం లాంటి, etc...)సినిమాలు చూసి, గుర్రాలు, గన్నులు, బాంబులు అంటే మంచి ఇంట్రెస్ట్ వుండేది. అందుకే బాంబుల గురుంచి ఏమైనా రాసారేమో అని చాల ఉత్స్తాహంతో చదివాను...చదివాకా అర్థం అయ్యింది.... బాంబుల రెడ్డి అనేది మా వూరిలో వాళ్ళు పెట్టిన పేరు అని.

మొదట్లో ఒక ఫ్యాక్షనిస్ట్ గా, గ్రూప్ రాజకీయాల నేత గా, ఆల్వేస్ అసమ్మతి నాయకుడి గా వున్న ఆయన, ఆ తర్వాత కాలంలో చాల మారిపోయాడు అని అంటారు. చంద్రబాబు హయాంలో ప్రతి పక్ష నేతగా వున్నప్పటికీ, బాబు తన హైటెక్ ట్రిక్స్ తో జనాలని తన వైపు తిప్పుకోవటం లో సఫలం అవ్వటంతో, అప్పుడప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల టైం లోను, అడపాదడపా వచ్చే మిమిక్రీ షో టైం లోను తప్ప జనాలకి YSR గుర్తువుండటం తక్కువే.

పాదయాత్ర చెయ్యమని సలహా ఎవరు ఇచ్చారో కానీ అది నిజంగా YSR జీవితాన్ని మార్చేసింది. మొదట్లో ఆ సలహా ఇచ్చిన వ్యక్తి కి "What an Idea sir ji" అని YSR థాంక్స్ చెప్తారేమో అనుకున్నాను, కానీ ఆ థాంక్స్ మన రాష్ట్ర ప్రజలు చెప్పుకునేలా చేసాడు. పాదయాత్ర తో "మనకు ఇలాంటి నాయకుడు కావాలి" అనుకునేలా చేసిన ఆయన, ఆ తర్వాత తన పరిపాలనతో, పధకాలతో "మనకు ఇలాంటి నాయకుడు మాత్రమే కావాలి" అనుకునేలా చేసాడు.

NTR తర్వాత అంతటి ఇమేజ్ వున్న(సంఖ్యా పరంగా అంతకంటే ఎక్కువే) హీరోగా చిరంజీవి రాజకీయ ప్రవేశం, చంద్రబాబు హైటెక్ హామీలు, మహాకుటమి పేరుతో పరిమిత'కాల కూటమి' లాంటివి ఏమి కూడా YSR ని ఆపలేకపోయాయి. కాంగ్రెస్ కి పడిన ప్రతి ఓటు YSR ను చూసి వేసారు అని చెప్పటం లో ఏ మాత్రం సందేహం లేదు.

చిరంజీవి సభలకి వచ్చిన జనం YSR సభలకి రాలేదు, బుడ్డోడు(Jr.NTR) ప్రసంగాల కోసం ఎగబడిన జనం YSR ప్రసంగాల కోసం ఎదురు చూడలేదు, ఐనప్పటికీ, జనాలకి YSR మీద వున్న నమ్మకం మిగిలిన వాళ్ళ మీద లేదు. ఐనా ప్రచారం లో ఎవరి స్టైల్ వారికీ వుంటుంది.YSR ని తమకు ప్రధాన పోటీగా భావించిన చిరంజీవి పులివెందుల లో తోడ కొట్టాడు. NTR ఫ్యామిలీ కి ఆ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే పోటి అని భావించిన బాలకృష్ణ, కారంచేడు లో అక్క ఇంటి ముందు తోడ కొట్టాడు. అసలు వీళ్ళు ఎవరు తనకు పోటి కాదు అనుకున్న YSR మొగల్తూరు లో " Flying kisses " తో ప్రేమను పంచటానికి ట్రై చేసారు.

మొదట ముక్కోపి గా పేరు వున్నపటికి, తర్వాత తనలో ఆ కోపం నరం తెగిపోయింది అని చెప్పే అయన, తను చేసే కొన్ని పనులు చూస్తే, నిజమేనేమో అనిపిస్తుంది. మాకు 290 సీట్లు వస్తాయి అని అల్లు అరవింద్ చెప్పినప్పుడు, వంద రోజుల్లో YSR ని ఇడుపులపాయలో కుర్చోబెడతా అని చంద్రబాబు ప్రతిజ్ఞ చేసినప్పుడు, YSR ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి లైట్ తీసుకున్నాడు. చంద్రబాబు ని దొంగబాబు అని పిలిచి కామెడీ చెయ్యటం ఆయనకే చెల్లింది. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఎంతో ఆవేశంతో ఎన్నో ఆరోపణలు చేసినప్పుడు, ఒక నవ్వు నవ్వి, " ఊరుకోవయ్య చంద్రబాబు... నువ్వు కూడా మాకు చెప్తున్నావా" అని తన స్టైల్ లో చెప్పినప్పుడు చూస్తున్న వారు " TOM & JERRY " షో లా ఎంజాయ్ చేసారు.

ఒక వ్యక్తి మరణించాడు అని ఆ షాక్ తో లేదా భాధ తో 350 మంది పైగా మరణించటం నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడా చదవలేదు. ఆంధ్ర లో ప్రతి ఇంట్లో కూడా, పార్టీలకు అతీతంగా, తమ సొంత వ్యక్తి ని కోల్పోయినట్లు భాదపడటం కూడా ఎప్పుడూ చూడలేదు. రాజకీయాలలో ఆరోపణలు సాదారణమే అయినప్పటికి, ఎంత నిజమో, ఎంత అబద్దమో తెలియని జనం మాత్రం కన్ఫుజ్ అవుతుంటారు... అదే విధంగా, YSR మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.... అవి నిజమే అవ్వోచ్చేమో. కానీ ఒక మంచి నాయకుడిని, పేదల కష్టాలు తెలిసిన & తీర్చగలిగిన ఒక మంచి ముఖ్యమంత్రి ని మనం కోల్పోయాము అనేది మాత్రం నమ్మలేని, నమ్మటానికి ఇష్టపడని ఒక చేదు నిజం.

May his soul rest in Peace.