22, జూన్ 2009, సోమవారం

Few precious days

హెన్ లేదు, ఎగ్ లేదు, చిక్ పేరు చక్రి అన్నాడంట వెనకటికి ఒకడు...... కొరియా లో కంప్యూటర్ లో కేశినేని ట్రావెల్స్ లో భాగ్యనగరం నుంచి బెంగలూరు కి టికెట్ బుక్ చేస్తూ నేను కూడా అలాగే అనుకున్నాను.... ఎందుకంటే నేను ఇండియా కి వచ్చే డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు..... ఇండియా కి వచ్చాక ఆఫీసు లో ఫార్మాలిటీస్ పూర్తిచేసి,బెంగలూరు నుంచి విజయవాడ(ఆ పక్కనే వున్న ఘంటసాల) వెళ్లి, క్రిస్మస్, జనవరి 1st కి ఇంట్లో వుండి, ఆ తర్వాత హైదరాబాద్ లో ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి, 3 రోజుల తర్వాత బెంగుళూరు బయలుదేరటానికి నేను ఇప్పుడు టికెట్ బుక్ చేసింది. ఈ రౌండ్ ట్రిప్ లో ఈ టికెట్ తప్ప ఏ టికెట్ బుక్ అవ్వలేదు.
ఆ తర్వాత నేను ఇండియా రావటం, ఇంటికి పోవటం, వేగంగా జరగటంతో..... ఆ పల్లెటూరిలో కూర్చుని ప్రశాంతమైన గాలి పీల్చుకున్నా. ఆ ప్రిషియస్ డేస్ లో ఫెస్టివల్ చేసుకుని, హైదరాబాద్ హమారీ జాన్ అనుకుంటూ పయనం అయ్యాను.

జీవితం లో కొన్ని సంబంధాలు,కొన్ని సంధర్భాలు ఎప్పటికి స్పెషల్ గానే వుంటాయి. గతంలో కన్నీళ్ళు వచ్చిన సంధర్భాలు తలచుకుంటే ప్రస్తుతం నవ్వు రావచ్చు. ఇలాంటివి ఎప్పుడు కేవలం మన మీద మాత్రమే ఆధారపడి వుంటాయి. ఆ టైం లో నేను అంత సున్నితంగా లేదా చిన్నపిల్లాడిలా ఎలా వున్నాను అని నవ్వుకుంటాము. example చెప్పనా...చిన్నపుడు అక్క తోనో, తమ్ముడి తోనో తిండి విషయం లో తగువులు, అలకలు గుర్తు వున్నాయా ?...అవి గుర్తు వస్తే ఇప్పుడు నవ్వు వస్తుంది కదూ........ కాని...... గతంలో నవ్విన సందర్బాలు తలచుకున్న్నపుడు, ప్రస్తుతం కళ్ళ వెంట నీళ్ళు వస్తే మాత్రం అది మనతో పాటు, పక్కన వున్న వాళ్ళ మీద కూడా ఆధారపడి వుంటుంది. ఆ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నామనో, అలాంటి రోజులు చాల మిస్ అవుతున్నామనో లేదా అలాంటి రోజులు మళ్లీ రావు అనో...... దీనికి కూడా example చెప్పనా.... ఒక సారి కాలేజీ డేస్ ని, farewell functions ని, ఫ్రెండ్స్ తో హ్యాపీ మొమెంట్స్ ని గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి మొమెంట్స్ లో మనతో వున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు స్పెషల్ గ మిగిలిపోతారు.....నేను ఇప్పుడు అలాంటి ఫ్రెండ్ దగ్గరకే వెళ్తున్నాను... స్టొరీ కాకుండా షార్ట్ గ చెప్పమంటే, He is my Best Friend.

అయ్ బాబోయ్, సడన్ గ ఇంత క్లాసు పీకేసాను ఏంటి ?..... ఏమి లేదండి .... నాకు గంగూలీ గుర్తొచ్చాడు.. తను ముందుకొచ్చి కొట్టిన షాట్లు, మనసు విప్పి చెప్పిన మాటలు ఎప్పటికి గుర్తు వుంటాయి.... ఏమి చెప్పాడా అనా మీ డౌట్...... " చార్ జీతోం ... చార్ దోస్తోం "..

హ్యాపీ గ రెండు రోజులు హైదరాబాద్ లో రౌండ్లు కొట్టాను. రాకింగ్ రైడింగ్ పేరు చెప్పి మా వాడు రేసింగ్ డ్రైవ్ చేస్తుంటే నాకు వీడియో గేమ్ ఆడుతున్నట్లు అనిపించేది.... ముడో రోజు నా ఫ్రెండ్ తో కలసి తన కాబోయే వైఫ్ ని కలవటానికి వెళ్ళాను. వాడి టెన్షన్ చూసి వైఫ్ దగ్గరకు వెళ్తున్నామో లేక నైఫ్ దగ్గరకు వెళ్తున్నామో అర్థం కాలేదు, తనని కలిసాక మాత్రం నైఫ్ కాదు నైస్ అని అర్థం అయ్యింది....మన బాష లో Made for each other లా, కృష్ణ మూవీ లో సునీల్ స్లాంగ్ లో, చూడటానికి పార్వతి పరమేశ్వరులు లానే వున్నారనిపించింది.

ఏదైనా తినాలి అనిపిస్తే లంచ్ చేసి... ఏమినా కొనాలి అనిపిస్తే షాపింగ్ చేసి... ఆపై ఏమి చెయ్యాలో తెలియక టైం పాస్ చేసి... పని లేక కొన్ని ఫన్నీ ప్లాన్స్ వేసి... మొత్తం మీద బాగా ఎంజాయ్ చేసి...ఆ తర్వాత రూం కి వచ్చి... నా ప్రయాణానికి సమయం అయ్యిందని గ్రహించి... నేను నా ఫ్రెండ్ స్టార్ట్ అయ్యాము.

తార్నాక లో కొంచం దూరం వచ్చాక ఒకడు కనిపించాడు.... ఎర్రగడ్డ హాస్పిటల్ లో వుండాల్సిన వాడు ఎందుకు రోడ్ మీద వున్నాడో అర్థం కాలేదు.చేతిలోని రాళ్ళని, సిటి బస్సు మీద వేస్తూ మా బండి కి అడ్డంగా వచ్చాడు.ఆ షాక్ లో మా ఫ్రెండ్ బ్రేక్ వెయ్యటం మర్చిపోయాడు.వెంటనే మేము వాడికి చిన్నగా డాష్ ఇవ్వటం,మా బైక్ ఆగటం ఒకేసారి జరిగాయి.
వాడిని చుస్తే ముస్లిం లా,ఆ ఏరియా కూడా ముస్లిం ఏరియా లా అనిపించింది.దానితో మేము ఆ భాగ్యనగరం లో అభాగ్యులము అయ్యేలా వున్నమేమో అనిపించింది.ఒక వైపు వాడికి అసలు దెబ్బలు తగలకపోయినా,ఏదో విరిగిపోయినట్లు యాక్ట్ చెయ్యటం స్టార్ట్ చేసాడు,ఇంకో వైపు,మా చుట్టూ జనాలు చేరటం స్టార్ట్ చేసారు.వాడికి తగలని దెబ్బలకి మమ్మల్ని డబ్బులు అడిగితే,మేము ఇవ్వటానికి రెడీ అవుతుండగా,ఆ పక్క షాప్ అంకుల్ వచ్చి ఆపాడు....తప్ప తాగి,బస్సు మీద రాళ్ళు వేసి,రోడ్ కి అడ్డం గ నడిచి,బండి కి అడ్డం వచ్చి, తప్పు తన వైపు పెట్టుకుని,మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నావు అని వాడిని నిలదీశాడు.ఇంతలొ అక్కడ వున్న జనం కూడా మాకు సపోర్ట్ గ మాట్లాడటం తో,వాడు మమ్మల్ని వదిలేసాడు.భాగ్యనరం లో ఇంకా షాప్ అంకుల్ లాంటి మంచి వాళ్ళు వుండటం వల్లే, దౌర్బ్గాగ్యనగరం కాలేదు అనిపించింది.

మా ఫ్రెండ్ కి బై చెప్పి, బస్సు ఎక్కాను. అప్పటికే నా పక్క సీట్ లో ఒక అమ్మాయి వుంది. పేస్ అమ్మాయి లానే వున్నా, డ్రెస్ మాత్రం అబ్బాయిది లా వుంది.బస్సు బాయ్ వచ్చి,నన్ను వెనుక ఎక్కడో కూర్చోమన్నాడు. నేను నా సీట్లోనే కుర్చుంటాను, ఆ అమ్మాయిని వెనుక కూర్చోమని చెప్పు అన్నాను... ఆ అమ్మాయి నా వైపు ఒక లుక్ వేసి "పర్లేదు మనం ఇద్దరం కూర్చుందాం" అంది. అబ్బాయి పక్కన కుర్చుని తను రిస్క్ చేసిందేమో అనుకున్నా..... కాని ఆ రిస్క్ నాకు అని త్వరగానే అర్థం అయ్యింది.

తన పక్కన వెళ్లి కూర్చోగానే, స్పిరిట్ స్మెల్ వచ్చింది.తను తాగి వచ్చిందేమో అని డౌట్ కూడా వచ్చింది. టీవీ లో మూవీ వస్తుంది, తనకు మాత్రం సీరియస్ సీన్ లకు కూడా నవ్వు వస్తుంది. నాగార్జున మూవీ అవ్వటంతో నేను కూడా చూస్తూ వున్నాను. మా ఇద్దరి మధ్య వున్న హ్యాండ్ రెస్ట్ మీద తను కొంచం, నేను కొంచం ప్లేస్ లో హాండ్స్ పెట్టుకుని కూర్చున్నాం. రోడ్ మలపులకో,బస్సు బ్రేక్ లకో, స్పీడ్ బ్రేకర్స్ స్టాప్ లకో, నా చెయ్యి కొంచం తగలగానే, ఎమర్జెన్సీ సైరన్ లా 'excuse me' అనేది. కొంచం సేపటికి ఇద్దరం నిద్ర పోయాము.

ఎప్పుడో 'excuse me' అని సౌండ్ వినపడటంతో మెలకువ వచ్చింది. సేం రీజన్, సేం సైరన్. నాకు అలా నిద్ర పట్టటం, తను ఇలా నిద్ర లేపటం చాల సార్లు జరిగింది.టైం 2 అయ్యింది.ఆ నైట్ నాకు నరకం చూపించటానికి డిసైడ్ అయినట్లు వుంది. నాలో సహనం పోయి ఆ ప్లేస్ లో స్లీప్ రిప్లేస్ అవుతుంది. ఫైనల్ గ తనతో ఇలా చెప్పాను... " ఏమండి, మిమ్మల్ని టచ్ చేసే వుద్దేశం నాకు లేదు... ఇక నుంచి, ఏమైనా టచ్ ఐతే... మీరు మంచి వాళ్ళు ఐతే కొంచం అటు జరపండి...లేదు అంటే విసిరి కొట్టండి...నన్ను మాత్రం నిద్ర లేపకండి" అని వేరే సైడ్ తిరిగి నిద్రపోయా.... ఆ తర్వాత నాకు ఆ సైరన్ సౌండ్ వినిపించలేదు.

మార్నింగ్ లేచిన తర్వాత తన వంక చూసా...రాత్రి కన్నా కొంచం బెటర్ గ అనిపించింది. క్యాజువల్ గ మాటలు కలిసాయి. కరెక్ట్ గ నేను దిగిపోయే ముందు, డేర్ చేసి తనని అడిగా... ఏమండి నిన్న నైట్ డ్రింక్ చేసి స్టార్ట్ అయ్యారా అని ... తన పేస్ కన్ఫుసింగ్ గ పెట్టింది.... నిన్న నైట్ స్పిరిట్ స్మెల్ వచ్చింది అని చెప్పా... తను షర్టు స్లీవ్ పైకి లాగింది... లాగిపెట్టి కొడుతుందేమో అని అందనత దూరం జరుగుదాం అనుకున్నా.... అప్పుడు కనిపించింది ... తన హ్యాండ్ కి ఒక వౌండ్, దానిపై టించర్ తో ఒక బ్యాండ్.

5, జూన్ 2009, శుక్రవారం

ప్రయాణం - A trip to Hogenikal

IPL అయ్యిపోయాక, TV లో ఇంటరెస్టింగ్ గా చూడటానికి ఏమి లేక, తేజ ఛానల్ లో తమ్ముడు మూవీ చూస్తున్నా.ఒక సీరియస్ సీన్ వస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ లో 'వేళా పాలా లేకుండా' సాంగ్ వస్తుంటే,నేను వెళ్లి మొబైల్ లో కాల్ అటెండ్ చేశా... కన్ఫుజ్ అవ్వకండి, ఆ సాంగ్ తమ్ముడు మూవీ లోదే అయ్యినా, అప్పుడు వచ్చింది మాత్రం నా మొబైల్ నుంచి. ఎందుకనగా అది నా రింగ్ టోన్ కనుక.

నాకో చిన్నప్పటి ఫ్రెండ్ వున్నాడు....వాడికి నేనంటే ఒక పెద్ద అభిప్రాయం కూడా వుంది... నాకు కొంచం బలుపు అని, అందువల్ల నేను ఫ్రెండ్స్ ని కలవాలి అనుకున్నపుడు, వాళ్ళని నా దగ్గరకు రమ్మంటాను అని, నేను మాత్రం వాళ్ళ
దగ్గరకు రానంటాను అని వీడి నమ్మకం. బద్దకాన్ని, బలుపు అనుకునే అమాయకత్వం వాడిది.

తను కాల్ చేసి,రేపు కలుద్దాం, కలసి హొగెనకల్ వెళ్దాం అన్నాడు... సరే అని కాల్ కట్ చేశా. నార్మల్ గా వీకెండ్ అనగానే, ఒక ఫెవికాల్ బాటిల్ తీసుకుని, కొత్తగా కొన్న కుర్చీ సీట్ కో, లేక నా బెడ్ కాట్ కో పూసుకోవటం నాకు అలవాటు... ఈ వీకెండ్ కి మాత్రం కుర్చీ సీట్ కి, బెడ్ కాట్ కు కాకుండా,నా హార్ట్ కి రాసుకుని, డేఫనేట్ గా వాడితో హొగేనికల్ వెళ్దాం అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యా.

ఈగర్ గా ఎర్లీ మార్నింగ్ లేచి, హడావిడి గా రెడీ అయ్యి,మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పులేసుకుని,చెప్పిన చోటకి వెళ్ళాను..నేను వెళ్ళిన కొంచం సేపటికి మా ఫ్రెండ్ వచ్చాడు...తను తమిళనాడు తరలి వెళ్ళటంతో తనని కలసి చాల కాలం అయ్యింది... నన్ను చూడగానే సినిమా హీరో లా వున్నావురా అన్నాడు. తమిళనాడు లో వుంటున్నాడు
కదా, పితామగన్(తెలుగు లో శివపుత్రుడు ), సుబ్రమణ్యపురం(తెలుగు లో అనంతపురం) లాంటి సైకో సినిమా ఏదో తీసే ప్లాన్ లో వున్నాడేమో అనుకున్నా.

మిగిలిన ఫ్రెండ్స్ తో పరిచయాలు ఐన తర్వాత, మొత్తం 8 మంది కలసి జోరుగా జర్నీ స్టార్ట్ చేసాము...కింగ్ ఫిషర్ ఫ్లైట్ ప్రయాణం లో ప్రికాషన్స్ ఇస్తున్న మాల్యా లా, మా ఫ్రెండ్ తన రైడింగ్ గురుంచి రూల్స్ చెప్పాడు. ఎంతైనా మా ఫ్రెండ్ ది విశాల హృదయం. వాడు ఎలాంటి రోడ్ మీద ఐన ఒకేలా రైడ్ చేస్తాడు. గుంటల్ని, గుట్టల్ని సమానంగా చూసే సహృదయుడు వాడు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ కాకుండా స్పీడ్ మాత్రమే వాడతాడు. బైక్ కి కూడా సీట్ బెల్ట్ అవసరం అనుకునేలా చేసాడు వీడు.

మా ఫ్రెండ్ మంచితనానికి ముచ్చటపడి ముద్దు పెట్టుకోవాలనుకుందేమో, సిల్క్ బోర్డ్ రోడ్ స్లిప్ చేసింది. ఆ స్కిడ్డింగ్ కి ఇద్దరం రోడ్ కి అడ్డంగా పడ్డాం. తగిలిన దెబ్బలు చిన్నవే అవ్వటంతో అవి పెద్ద భయాన్ని మాత్రం క్రియేట్ చెయ్యలేదు. ఐనా నాది మాములు హార్ట్ కాదు కదా.... ఫెవికాల్ రాసుకున్న హార్ట్. అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది, మేము హొగెనకల్ చేరటానికి చేసేది ప్రయాణం కాదు ప్రయత్నం మాత్రమే అని.

అలా మొదలై, అత్తిబలి దాటాక ఆకలి అనిపిస్తే తమిళ్నాడు లో అడుగు పెట్టాక టిఫ్ఫెన్ తిన్నాము. నల్ల రంగు లో రోడ్సు,
నీలి రంగులో క్లౌడ్సు, పచ్చ రంగులో ప్లాంట్స్ తో ప్రతి సీన్ ఒక సీనరి లా ఓవర్ ఆల్ గ గ్రీనరీ లా అనిపించింది.అలాంటి ప్రశాంతమైన వాతావరణం లో పరుగులు పెడుతున్న వాహనాలపై వెళ్తూ,అలుపు అనిపించినప్పుడు అనుకూలమైన ప్లేస్ లో ఆగుతూ,ఆగిన చోట ఫోటోలు దిగుతూ మా పయనం సాగించాము.ఘాట్ రోడ్లు,గతుకుల రోడ్లు దాటి హొగేనికల్ చేరాము.

ఒక హోటల్ (పేరు తమిళనాడు)కి వెళ్లి భోజనం చేసాము.మార్నింగ్ టిఫ్ఫెన్,మధ్యానం మీల్స్ తర్వాత నాకు 2 విషయాలు అర్థం అయ్యాయి. (మొదటది), తమిళ్ హోటల్స్ లో సాంబార్ భావుంటుంది అని, ( రెండోది), సాంబార్
మాత్రమే భావుంటుంది అని.ఆ తర్వాత చిన్నపాటి తెప్పలు 2 తీసుకుని ఫాల్స్ చూడటానికి స్టార్ట్ అయ్యాము. ఆ తెప్పలు నడిపేవాడు మాకు కర్ణాటక ఫాల్స్,తమిళనాడు ఫాల్స్ చూపిస్తాను అంటే,అవి ఎంత దూరమో అనుకున్నాము,అక్కడకి వెళ్లి చూసాక తెలిసింది,పక్క పక్కనే వున్న ఫాల్స్ ని ఈ పక్క రాష్ట్రాల వాళ్ళు పంచుకున్నారు అని.

ఆ జలపాతం కిందకి వెళ్ళినప్పుడు,మా తాపం తీరేలా వాటర్ మీద పడుతుంటే అద్భుతం లా అనిపించింది.అక్కడ కొండల మీద నుంచి కాలువ లోకి దూకుతున్న పిల్లల్ని చూసి ఆశ్చర్యం అనిపించింది.ఆ పక్కనే వున్న ఐ-ల్యాండ్ లోకి వెళ్లి,వాటర్ లో ఆడుకుంటూనపుడు అనందం గా అనిపించింది.అలా ఒక గంట ఆడాక అలసట గా అనిపించింది.అటు వెళ్లి మెయిన్ ఫాల్స్ ని చూసినప్పుడు అమేజింగ్ అనిపించింది.

అలా అన్నిరకాల అనుభూతుల్ని మూట కట్టుకుని, తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. మధ్యలో కురిసిన వర్షంతో మా అందరి మీద నీళ్ళు కారాయి కాని మా ఆనందం మాత్రం నీరు కారలేదు. ఆ చిరు జల్లుల్లో సేఫ్ గా రూం కి చేరటంతో మా హొగెనకల్ ప్రయాణం(పయత్నం) పూర్తి అయ్యింది.