15, మే 2009, శుక్రవారం

నా గురుంచి

హాయ్ .... నా పేరు నాగరాజు ... ఇంజనీరింగ్ చేసి బెంగలూరు లో ఒక మంచి (?) సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తున్నా. ఎప్పుడు లేజీ గ వుంటూ అప్పుడప్పుడు యాక్టివ్ గ వుండటం నాకు అలవాటు.... ఫ్రెండ్స్ దీనిని బద్ధకం అని పిలిస్తే .... అదేదో MIT or Stanford లో Ph.D సర్టిఫికేట్ లా ఫీల్ అయ్యిపోవటం నాకు వున్న మరో మంచి (?) అలవాటు.
ఇంకా నా గురుంచి చెప్పమంటే .......I like to take the life as it comes... Trust in God.....Believe in my self...respecting others as i respect myself.
If i lost my money , then i feel "i lost nothing".
If i lost my time , then i feel "i lost something precious".
If i lost my character, then there is nothing that i have with me.
At any cost i don't want to lose my character.I never want to impose my feelings on anybody. And i can be more comfortable if they let me live as i wish.
అప్పుడు ఎప్పుడో చిన్నపుడు ఆర్కుట్ లో రాసిన 'నా గురుంచి' ని కాపీ చేసి పేస్టు చేశా.... ఇంగ్లీష్ లో వుంది అని ఏమి అనుకోకండి ... ప్రస్తుతం నేను లేజీ మోడ్ వున్నా.

గొప్పగా చెప్పుకునే అలవాట్లు ఐతే ఏమి లేవు..... నిద్ర పోవటం ... మ్యూజిక్ వినటం... గేమ్స్ ఆడటం లేదా చూడటం... నేను ఇష్టం గా చేసే పనులు.
క్రికెట్ లో సచిన్ కి నా కన్నా మంచి అభిమాని ఎవరు వుండరు అని నాకో ఎదవ నమ్మకం( నాకు వున్న కొరియా ఫ్రెండ్ కి మన దేశం లో వున్న గొప్ప వ్యక్తుల్లో(బ్రతికి వున్న వాళ్ళలో) ౩ పేర్లు చెప్పమంటే ....సచిన్ .... అబ్దుల్ కలాం... రెహమాన్ అని చెప్పా..... నిజానికి ౩ సార్లు సచిన్ అని చెప్పి నా అభిమానాన్ని చూపిద్దాం అనుకున్నా.... కాని క్రికెట్ గురుంచి తెలియని వాడి దగ్గర ఎందుకులే అని అలా చెప్పా)... అప్పుడప్పుడు షటిల్ ఎప్పుడన్నా చెస్ అండ్ కార్రోమ్స్ ఆడుతూ వుంటా..
సినిమాలు చూడటం తక్కువే.... నాగార్జున నా అభిమాన హీరో అండ్ పవన్ అంటే కొంచం సాఫ్ట్ కార్నెర్ ...... త్రివిక్రం అండ్ శేఖర్ కమ్మల మూవీస్ మాత్రం మిస్ అవ్వకుండా చూస్తా....

2 కామెంట్‌లు: