23, నవంబర్ 2009, సోమవారం

ప్రేమా ?? అయ్యో రామ ........

" November 12, 2009... అన్ని రోజులు ఒకేలా వుండవు ".. మార్నింగ్ లేచి టైం చూసుకుని నేను అలానే అనుకున్నాను. అందుకే కొంచం వెరైటీగా ఏమైనా చేద్దాం అని అలోచించి వెంటనే మా ఇంటికి ఫోన్ చేసి,ఈ రోజూ మనసు భాలేదు అందుకే ఆఫీసు కి వెళ్ళటం లేదు అని చెప్పాను.నేను మూడిస్ట్ ని అని మా పేరెంట్స్ కి తెలుసు, సో...మా ఫాదర్ "సరే " అన్నారు. మా మదర్ మాత్రం "ఇంటికి రా కన్నా" అన్నారు... నేనా ? ఈరోజా ? (సంతూర్ యాడ్ లోలా ఒక expression ఇచ్చి) నో అని చెప్పి ....కాల్ కట్ చేసి, కెవ్వు అని ఒక కేక పెట్టి, దుప్పటి ముసుగు పెట్టి, పడుకున్నాను.

మధ్యానం టైంలో ఓ వీక్లీ బుక్ లో ఓ లుక్ వేస్తే ప్రేమ అనే టాపిక్ నా కంటపడింది,ప్రేమ మీద ఆర్టికల్ అంటే దోమ మీద ప్రాక్టికల్ లాంటిది అని తెలిసినా,కళ్ళకున్న కుతూహలం కొద్ది చదివాను.వాడు నీ ప్రేమ,నా ప్రేమ అని ఏదో సోది చెప్పాడు. దానితో నా లాంటి వాళ్ళకు ప్రేమ మాత్రమే కాదు దాని మీద ఆర్టికల్స్ కూడా అర్థం కావు అనుకున్నాను.


ఐనా, అందరికి అర్థం అయ్యేలా మాట్లాడితే అది సిద్దాంతం,...... అర్థం అయ్యి, అవ్వనట్లు గా మాట్లాడితే అది వేదాంతం, ..... అసలు అర్థమే లేకుండా మాట్లాడితే అది రాద్దాంతం....నాకు వున్న తెలివితేటలకి కొన్ని సిద్దాంతాలు కూడా రాద్దాంతం లా అనిపిస్తాయి. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమతో ప్రేమించిన ప్రేమని ప్రేమ ప్రేమిస్తుంది లాంటి డైలోగ్స్ ని అర్థం చేసుకోవటం కష్టమే కదా....అందుకే ప్రేమ విషయం లో పక్క వాళ్ళు ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను.

ప్రేమ ఒక్కొకరికి ఒక్కోలా కనిపిస్తుంది(లేదా అనిపిస్తుంది)...మన తెలుగు సినిమా దర్శకుల లో కొంత మందికి ప్రేమంటే సత్యం లా,కొంత మందికి నిత్యం లా ,కొంత మందికి త్యాగం లా, కొంత మందికి తపస్సు లా,త్రివిక్రం కి ఎక్కాల పుస్తకం లో లెక్క లా అనిపిస్తుంది. బహుశా దేవుని తర్వాత అంత మందికి అన్ని వేరు వేరు రూపాలలో(లేదా భావాలతో) కనిపించటం ప్రేమ కే చెల్లింది.

ఈ మధ్య, ప్రేమ ఫలించని ఫ్రెండ్ ఒకడు ఓ మాట చెప్పాడు.... లవ్ అంటే స్టవ్ లాంటింది అని... దానికి దూరంగా వుండి చపాతీ లు కాల్చుకోవాలి తప్ప, దగ్గరగా వెళ్లి చేతులు కాల్చుకోకుడదు అని......ఫ్లేమ్ ని ప్రేమ ని ఒకేలా చూడాలి అని చెప్పాడు. అప్పటి వరకు ఆ అమ్మాయి వేరే మతం అని చెప్పి వెళ్లిపోయింది అనుకున్నాను.... అప్పుడే తెలిసింది, తను తప్పుకోలేదు, తప్పించుకుంది అని.

కొంత కాలం క్రితం మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు. వాడు "so expressive".
వాడు : బావ, కొంచం నీ భుజం ఇవ్వరా.
నేను: ఎందుకురా ? ఏమి అయ్యింది ?
వాడు: నీ భుజం మీద తల పెట్టి, ఏడవాలి అనుకుంటున్నాను రా !!!
(ఎందుకో గాని, వీడు భాధపడుతున్నాడు అంటే అందరికి(నాతో సహా) మంచి కామెడీ గా వుంటుంది. వాడు చెప్పే కారణాలు అలాగే వుంటాయి మరి).
నేను: హ హ... జేబు రుమాలు వొద్దా ?
వాడు: జోకులు వొద్దు !!!! చెప్పేది సీరియస్ గా విను.
(మా వాడు తన రీసెంట్ లవ్ స్టొరీ చెప్పాడు... ఆ స్టొరీ మొత్తం ౩ నెలల్లో జరిగింది.. ఆ టైం లో నేను ఇండియా లో లేను)
నేను:నాకు కొంచం సరిగ్గా అర్థం కాలేదు రా...నేను కొన్ని డౌట్స్ అడగనా ?
వాడు: ప్రేమించాను అన్నపుడు,... ఎప్పుడు అని ........... వదిలేసింది అంటే,... ఎందుకు అని మాత్రం అడగకు ....... ఎందుకంటే, మొదటి దానికి నా దగ్గర, రెండో దానికి తన దగ్గర జవాబులు లేవు....(ఆ తర్వాత నా దగ్గర అడగటానికి ప్రశ్నలు లేవు).

మా వాడు స్టొరీ మొత్తం చెప్పి ఏడవలేక, నవ్వటం స్టార్ట్ చేసాడు. వాడు స్టొరీ స్టార్ట్ చేసినప్పుడు కామెడీ గా అనిపించి, కష్టపడి నవ్వుని ఆపుకున్నాను. అదే స్టొరీని ఎండ్ చేసినప్పుడు అంతే కష్టంతో నవ్వటానికి ట్రై చేశాను. మా ఫ్రెండ్ షారుక్ ఖాన్ లాంటి వాడు..... వాడు నవ్వుతూ, ఎదుటి వాళ్ళను ఏడిపించగలడు.... నేను ముందే చెప్పా కదండీ, వాడు "so expressive" అని.

అమర ప్రేమలన్నీ అల్లరి తోనే స్టార్ట్ అవుతాయి అని ఒక నానుడి..... అందుకేనేమో అందమైన అమ్మాయిలందరూ అల్లరి చేసే అబ్బాయిలకి పడిపోతారు......అందుకే లైఫ్ లో యాక్టివ్ గా, లవ్ లో హైపర్ యాక్టివ్ గా వుండే మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు......అబ్బాయిలు ఎప్పుడు "fast & furious" గా వుండి, కొంచం "cute & curious" గా వున్న అమ్మాయి కనిపించగానే,వెంటనే వెళ్లి ' ప్రేమించుకుందాము రా!!! ' అనేలా వుండాలి. అలా కాకుండా, " రబ్ నే బనాది జోడి" అనుకుంటే, ఆ తర్వాత, ఆ లైఫ్ సినిమా లా కాకుండా సీరియల్ లా వుంటుంది అని చెప్పాడు.

ఈ వీకెండ్ లో కూర్చుని, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో ఒక పేపర్ మీద రాసుకోవాలి అని మా రూం మేట్ అన్నాడు...నేను, " ఎందుకు ?" అని అడిగాను....అలాంటి అమ్మాయి దొరికితే ప్రేమించి, కుదిరితే పెళ్ళి చేసుకోవటానికి అన్నాడు....పెళ్ళి కోసం అలా లిస్టు అవుట్ చేసుకుని, వర్క్ అవుట్ చేయ్యోచేమో కాని, ప్రేమించటానికి కూడా అలాంటి లిస్టు ఒకటి ప్రిపేర్ చేసుకోవాలా అని డౌట్ వచ్చింది. If you feel that you are loving a person by her unique qualities then tell me that you are loving her........But if you love a person who is having the qualities that you want in a girl, then dont tell me you are loving her,....... bcoz,...... you are not loving her, instead, you are respecting your feelings by findng a " human representation" of it. అని ఆవేశంగా చెప్దాం అనుకున్నాను.... పిల్లోడా!!!!, సినిమా డైలాగులు చెప్పకు అని ఒక లుక్ వేస్తాడెమో అని చెప్పలేదు. కోతి ముందు కుప్పిగంతులు వెయ్యకూడదు అని నాకు కూడా తెలుసు...

ఇంతకీ నేను ఏమి చెప్పాలి అనుకున్నానో మీకు అర్థం అయ్యిందా ?.... అర్థం అవ్వక పోతే మల్లి చదవండి...అర్థం ఐతే, ZTS స్పేస్ YES అని టైపు చేసి 8756 కి SMS చెయ్యండి.

ప్రేమంటే పాము లాంటిది అని,అది పెరిగి పెద్దయ్యాక ఏదో ఒక రోజు కాటు వేస్తుంది అని, అప్పుడు ప్రేమ కాటు కు స్కాట్చ్ దెబ్బ అవసరం అని నేను చాల మంది దగ్గర విన్నాను. భాద పోవడానికి బీరు, వైరాగ్యం పోవటానికి వైన్ , విసుగు పోవటడానికి విస్కీ అవసరం లేదా అని అడగకండి...ఎందుకంటే, ఏ రాయి ఐతే ఏముంది, పళ్ళు రాలగొట్టుకోవటానికి.

ప్రేమంటే చిగురాకు లా వుండాలి కాని, చిరాకు లా ఉండకూడదు. అది అలా వుండాలి అంటే, అమ్మాయిలకి, compliments లా వుండే కామెంట్స్........కలిసినప్పుడు 'comfort'ness...... 'కలిసే వుంటాం' అనే confidence ఇస్తే చాలు.... ఓస్ ఇంతేనా అనుకోకండి.....ఆ Comfort లోనే వుంది Infinite.

ఏంటి ?? ....అబ్బాయిలకి ఏమి కావాలో చెప్తాను అని వెయిట్ చేస్తున్నారా ?.... నాకు ఏమి కావాలో చెప్పి, ప్రతి అబ్బాయి, అదే కోరుకుంటాడు అని చెప్పేంత ఫూల్ ని కాదు.