16, మే 2009, శనివారం

One day @Bangalore

' డాన్స్ పే ఛాన్స్ మార్ లే ' అన్న సౌండ్ విని నాకు మెలకువ రావటం, నేను కంగారు పడటం ఒకే సారి జరిగాయి...... నేను కంగారు పడింది నిద్ర లేచినందుకు కాదు ... నా అలారం టోన్ ఎందుకు మారింది అని.... అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది .... ఆ వచ్చే సాంగ్ నా మొబైల్ నుంచి కాదు MTv నుంచి అని.... ఐనా నేను ఏడింటికి పెట్టుకున్న అలారం ఏడు సార్లు మోగకుండా నిద్ర లేవటం ఎందుకు లే అని మల్లి పడుకున్నా. అలా పడుకుని రెండు నిమషాలు కూడా కాలేదు, మా పక్కింటి వాళ్ళు మోటార్ వెయ్యటం, మా బావ బాత్రూం నుంచి బయటకు రావటం ఒకే సారి జరగటం తో ఆ మోటార్ సౌండ్ , మా బావ షాంపూ స్మెల్ తో నేను నిద్రపోలేను లే అని లేవటానికి డిసైడ్ అయ్యా . అసలు మా పక్కింటి వాళ్ళు వాటర్ కోసం మోటార్ వేస్తారో లేక మమ్మల్ని నిద్ర లేపటం కోసం వేస్తారో అర్థం కాదు.....

ఇంజనీరింగ్ చేసాక GATE రాయని వాళ్ళు అన్నా.... ఇంట్లోకి వచ్చాక GATE వేసేవాళ్ళు అన్నా మా బావకు చాల చిరాకు అందుకే బాత్ రూం డోర్ వెయ్యకుండానే వెళ్తున్నాడు.....అందుకే బాత్ రూం వైపు చెయ్యి చూపి, డోర్ క్లోజ్ చెయ్యి బావ అన్నా...వాడు బెడ్రూం డోర్ క్లోజ్ చేసి హల్లోకి వెళ్ళాడు.మా బావ కి బ్రెయిన్ లో 2 parts వున్నాయి . Left part has nothing left in it and Right part has nothing right in It. అందుకే నేను లేచి..డోర్ క్లోజ్ చేసి...దేవునికి ప్రే చేసి...బ్రష్ కి పేస్టు వేసి...ఫ్యాన్ ఆఫ్ చేసి...ఇంటికి వచ్చిన ఈనాడు పేపర్ చూసి...బాత్ రూం లోకి దూరాను.

నేను రెడీ అయ్యి, కాళ్ళకి షూస్ వేసుకుంటున్నా, మా ఇంకో రూం మేట్ ఏదో సెటైర్ వేసాడు, వాడికి ఎదురు సెటైర్ వస్తే ఇంకా నేను రిటైర్ అయ్యే వరకు వదలడు అని తెలిసి, ఒక చిన్న స్మైల్ ఇచ్చి, రూం నుంచి బయటకి వచ్చాను. ఎందుకంటే మా వాడు ప్రాస కోసం ప్రాణాలు ఇస్తాడు.... వాడి ప్రాణాలు అనుకుంటున్నారేమో .... ప్రక్కనున్న వాడి ప్రాణాలు.

2 ఇల్లు తర్వాత ఒక ఇంటి ముందు ఒక చిన్న పాప స్కూల్ కి రెడీ అయ్యి బస్సు కోసం వెయిట్ చేస్తుంది...ఒక టర్న్ తీసుకుని మార్థహళ్లి మెయిన్ రోడ్ లోకి వచ్చేసరికి అక్కడ ఒక అబ్బాయి(ఇంటర్ అనుకుంట) కాలేజీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు....... కొంచం ముందుకు నడిచేసరికి అక్కడ మా ఫ్రెండ్ TCS బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు.... స్కూల్ నుంచి కాలేజీ కి దాని తర్వాత ఆఫీసు కి ... వయసు మారినా, బస్సు కోసం వెయిటింగ్ మారలేదు.

ఆఫీసు కి వచ్హాక ఒక అందమైన అమ్మాయి కనిపించింది... పైన పేస్ చూసి భావుంది అనుకున్నా.. కింద కాళ్ళు చూసి అసలు భాలేదు అనుకున్నా....నేను భాలేదు అనుకున్నది ఆమె కాళ్ళు కాదు .... ఆ కాళ్ళకి మెట్లు వుండటం...అంతలో ఆ అమ్మాయికి సారీ అంటి కి కాల్ వచ్చింది... మేరా నెంబర్ కబ్ ఆయేగా(ఇంకో అమ్మాయి మొబైల్లో ) అనుకుంటూ నా ప్లేసుకి వెళ్ళా.... మా పక్క టీం వాడు కనిపించాడు.... వాడికి ఆఫీసు పని అంటే కష్టం.. ఆఫీసు మనీ అంటే ఇష్టం.... వాడి వల్ల ఆఫీసు కి మాత్రం చాల నష్టం.... ఆఫీసు కి అంటే అదేదో అడవికి వెళ్ళిన టైపు లో వస్తాడు....

సిస్టం ఆన్ చేసి, ఆఫీసు మెయిల్స్ చెక్ చేస్తున్నా... మా టీం మేట్స్ వచ్చి టిఫ్ఫెన్ కి పిలిచారు..... మా బ్రహ్మాచారుల బాచ్ లో ఒక సంసారి కూడా వస్తున్నాడు.. ఎప్పుడు ఇంట్లో టిఫ్ఫెన్ చేసే వాడు మాతో ఎందుకు వస్తున్నాడో తెలియలేదు.... ఇంట్లో మీ ఆవిడ కొట్టిందా అని అడిగాడు ఒకడు...ఒక స్మైల్ ఇచ్చి , ఈరోజు లేట్గ లేచాము అని చెప్పాడు తను .... తనని చూస్తే సంసార సాగరం లో ఎదురు ఈదుతున్నడమో అనిపించేది..ఈరోజు చూస్తే ఈదలేక కొట్టుకు పోతున్నాడు అనిపించింది.

కాఫెటేరియా కి వెళ్లి పొంగల్ తీసుకుని తిందామని కూర్చున్నా... వాడు రైస్ లో డాల్డా వేసాడో లేక డాల్డా లో రైస్ వేసాడో అర్థం కాలేదు కాని పొంగల్ లో డాల్డా చాల ఎక్కువ అయ్యింది అని అర్థం అయ్యింది ....తింటే పొట్ట ఆకారం పెరుగుతుంది... తినకపోతే పొట్టలో ఆకలి పెరుగుతుంది.. దేనిని పెంచాలా ? అని ఆలోచిస్తున్నా...ఇంతలొ మధ్యానం పార్టీ వుంది అని ఒకడు గుర్తు చేసాడు... ఐతే ఆకలి ని పెంచుదాం అని డిసైడ్ అయ్యాను.

క్యుబికల్కి వచ్చి కుర్చుని కోడింగ్ చెయ్యటం స్టార్ట్ చేశా... లంచ్ కి వేళాయెరా అని మా ఫ్రెండ్ పింగ్ చేసాడు.. అదే టైం లో పార్టీ కి ఎక్కడకి వెళ్ళాలి అని డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.... KFC,PizzaHut,Village ఇలా చాల అలోచించి చివరకి పిజ్జాహుట్ అని డిసైడ్ చేసారు... నాకు ఇండియా లో పిజ్జా అంటే అసలు ఇష్టం వుండదు.... అసలే చాలా ఆకలిగా వుంది కాని తప్పదు అని వెళ్ళాము. పిజ్జా బాయ్ ఆర్డర్ తీసుకుని 18 minutes 45 seconds కి ఆర్డర్ సర్వ్ చేస్తాము అని చెప్పి వెళ్ళాడు. కొంచం టైం తర్వాత పిజ్జా వచ్చింది, అది ఒక పీస్ తిన్నాక నాకు అలుపు వచ్చింది.... పిజ్జా ని బాయిల్ చేసే తీసుకువచ్చాడా అని ఒక డౌట్ కూడా వచ్చింది. దానిని సాగదీస్తే చక్రవాకం సీరియల్ కన్నా ఎక్కువ లేన్ఘ్ట్ వచ్చేలా వుంది. ఈ పిజ్జా కష్టాలు అయ్యిన తర్వాత మల్లి ఆఫీసు కి వచ్చాము.

వర్క్ చెయ్యటం స్టార్ట్ చేసాము. నాకు మా ఆఫీసు లో Onsites తర్వాత బాగా నచ్చే విషయం అంటే అది వర్క్. ఎవరో చేసిన తప్పుల్ని సరి చెయ్యటం కన్నా, నేను తప్పులు చేసే ఛాన్స్ వచ్చింది(Bug fixing కాకుండా , new platform development లో వున్నాము).... టీ టైం అని మా ఫ్రెండ్స్ కాఫెటేరియా కి పిలిచారు.... ఒక జ్యూస్ ఆర్డర్ చేసి తాగుతూ మా ఫ్రెండ్స్ డిస్కషన్ ని ఎంజాయ్ చేస్తున్నా...

ఇంతలొ Sasken లో వర్క్ చేసే ఫ్రెండ్ కాల్ చేసింది. తనతో మాట్లాడుతూ వుండగా తను మధ్యలో తుమ్మి, వెంటనే సాస్కెన్ అంది.... నాకు అర్థం కాకా సాస్కెన్ అన్నావ్ ఏంటి అని అడిగా..... తను wipro లో చేస్తున్నా , Sasken లో చేస్తున్నా తుమ్మినప్పుడు మాత్రం Satyam అనే అనాలా ? అందుకే ఈరోజు నుంచి తుమ్మినప్పుడు Sasken అందామని డిసైడ్ అయ్యా అంది. నాకు మైండ్ బ్లాక్ అయ్యి తనలోనే పోకిరి మహేష్ బాబు కనిపించాడు.కొంచం సేపు మాట్లాడాక హాచ్ వాడు నన్ను కరుణించాడు ..... సిగ్నల్ కట్ చేసాడు.

మా ఫ్రెండ్స్ ఈరోజు పాలిటిక్స్ గురుంచి డిస్కషన్ చేస్తున్నారు.... అది ఎలాగు నాకు అవుట్ అఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి , నా ఏరియా అఫ్ ఇంట్రెస్ట్ లో ఎవరైనా మంచి తెలుగు అమ్మాయిలు కనపడతారేమో అని సెర్చ్ చేస్తున్నా.... ఇంతలొ నేను ఒక అమ్మాయిని చూడటం అది చూసి మా ఫ్రెండ్ తనని నాకు సిస్టర్ ని చెయ్యటం జరిగాయి..... మా ఫ్రెండ్స్ పొలిటికల్ డిస్కషన్ మాత్రం ఒక్క ఇంచ్ కూడా జరగలేదు.కొంచం సేపటి తర్వాత మల్లి వర్క్ చెయ్యటం స్టార్ట్ చేసాము....

కొంచం సేపటి తర్వాత ఈరోజు ఫ్రైడే అని గుర్తు వచ్చింది...చలో అని ఆఫీసు నుంచి రూం కి వచ్చా..హలో అని మా ఇంటి నుంచి కాల్ వచ్చింది...మా అమ్మ మాట్లాడుతూ ౩ ప్రశ్నలు అడిగింది, ఆ తర్వాత మా నాన్న కూడా అవే ౩ ప్రశ్నలు అడిగారు....మా అక్కకి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టాను... మా అక్క కూడా అదే ౩ ప్రశ్నలు అడిగింది.... తర్వాత మా బావ కూడా అవే ౩ ప్రశ్నలు అడిగారు..... మా అక్క వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ పడ్డాడు అంట... వాడితో మాట్లాడమని అక్క ఫోన్ వాడికి ఇచ్చింది...ప్రక్క నుంచి అక్క డబ్బింగ్ చెప్తుంటే వీడు కూడా అవే ౩ ప్రశ్నలు అడిగాడు ... రాజు మామ ఎలా వున్నావు ? ... భోజనం చేసావా ? .... ఘంటసాల ఎప్పుడు వస్తున్నావు ?... ౩ ప్రశ్నకు సమాధానం చెప్తూ వుండగా , వాళ్ళ తమ్ముడు వీడి సైకిల్ తీస్తున్నాడు అని ఫోన్ అక్కకి ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు....

బాత్ రూం లో బాత్ చేసి ..... భగిని రెస్టారెంట్ లో భోజనం చేసి.....మా టీవీలో మూవీ చూసి..... ఫోన్ లో ఫ్రెండ్స్ కి కాల్ చేసి.....watch లో టైం చూసి .... అలారం ఆఫ్ చేసి.... దేవునికి ప్రే చేసి... పడుకున్నా...

1 కామెంట్‌: