tag:blogger.com,1999:blog-73186342435435005512024-03-08T22:47:01.374+05:30గుర్తుకొస్తున్నాయి.....Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7318634243543500551.post-23846422998632254612009-11-23T11:55:00.005+05:302009-11-23T12:06:55.495+05:30ప్రేమా ?? అయ్యో రామ ........
" November 12, 2009... అన్ని రోజులు ఒకేలా వుండవు ".. మార్నింగ్ లేచి టైం చూసుకుని నే<wbr>ను అలానే అనుకున్నాను. అందుకే కొంచం వెరైటీగా ఏమైనా చే<wbr>ద్దాం అని అలోచించి వెంటనే మా <wbr>ఇంటికి ఫోన్ చేసి,ఈ రోజూ మనసు భాలేదు అందుకే ఆఫీసు కి వెళ్ళటం లేదు అని చెప్పాను.నేను మూడిస్ట్ ని అని మా పేరెంట్స్ కి తెలుసు, సో...మా ఫాదర్ "సరే " అన్నారు. మా మదర్ మాత్రం "ఇంటికి రా కన్నా" అన్నారు... నేనా ? ఈరోజా ? (సంతూర్ యాడ్ లోలా ఒక expression ఇచ్చి) నో అని చెప్పి ....కాల్ కట్ చేసి, కెవ్వు అని ఒక కేక పెట్టి, దుప్పటి ముసుగు పెట్టి, పడుకున్నాను.

మధ్యానం టైంలో ఓ వీక్లీ బుక్ లో ఓ లుక్ వేస్తే ప్రేమ అనే టాపిక్ నా కంటపడింది,ప్రేమ మీద ఆర్టికల్ అంటే దోమ మీద ప్రాక్టికల్ లాంటిది అని తెలిసినా,కళ్ళకున్న కుతూహలం కొద్ది చదివాను.వాడు నీ ప్రేమ,నా ప్రేమ అని ఏదో సోది చెప్పాడు. దానితో నా లాంటి వాళ్ళకు ప్రేమ మాత్రమే కాదు దాని మీద ఆర్టికల్స్ కూడా అర్థం కావు అనుకున్నాను.

ఐనా, అందరికి అర్థం అయ్యేలా మాట్లాడితే అది సిద్దాంతం,...... అర్థం అయ్యి, అవ్వనట్లు గా మాట్లాడితే అది వేదాంతం, ..... అసలు అర్థమే లేకుండా మాట్లాడితే అది రాద్దాంతం....నాకు వున్న తెలివితేటలకి కొన్ని సిద్దాంతాలు కూడా రాద్దాంతం లా అనిపిస్తాయి. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమతో ప్రేమించిన ప్రేమని ప్రేమ ప్రేమిస్తుంది లాంటి డైలోగ్స్ ని అర్థం చేసుకోవటం కష్టమే కదా....అందుకే ప్రేమ విషయం లో పక్క వాళ్ళు ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను.

ప్రేమ ఒక్కొకరికి ఒక్కోలా కనిపిస్తుంది(లేదా అనిపిస్తుంది)...మన తెలుగు సినిమా దర్శకుల లో కొంత మందికి ప్రేమంటే సత్యం లా,కొంత మందికి నిత్యం లా ,కొంత మందికి త్యాగం లా, కొంత మందికి తపస్సు లా,త్రివిక్రం కి ఎక్కాల పుస్తకం లో లెక్క లా అనిపిస్తుంది. బహుశా దేవుని తర్వాత అంత మందికి అన్ని వేరు వేరు రూపాలలో(లేదా భావాలతో) కనిపించటం ప్రేమ కే చెల్లింది.

ఈ మధ్య, ప్రేమ ఫలించని ఫ్రెండ్ ఒకడు ఓ మాట చెప్పాడు.... లవ్ అంటే స్టవ్ లాంటింది అని... దానికి దూరంగా వుండి చపాతీ లు కాల్చుకోవాలి తప్ప, దగ్గరగా వెళ్లి చేతులు కాల్చుకోకుడదు అని......ఫ్లేమ్ ని ప్రేమ ని ఒకేలా చూడాలి అని చెప్పాడు. అప్పటి వరకు ఆ అమ్మాయి వేరే మతం అని చెప్పి వెళ్లిపోయింది అనుకున్నాను.... అప్పుడే తెలిసింది, తను తప్పుకోలేదు, తప్పించుకుంది అని.

కొంత కాలం క్రితం మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు. వాడు "so expressive".
వాడు : బావ, కొంచం నీ భుజం ఇవ్వరా.
నేను: ఎందుకురా ? ఏమి అయ్యింది ?
వాడు: నీ భుజం మీద తల పెట్టి, ఏడవాలి అనుకుంటున్నాను రా !!!
(ఎందుకో గాని, వీడు భాధపడుతున్నాడు అంటే అందరికి(నాతో సహా) మంచి కామెడీ గా వుంటుంది. వాడు చెప్పే కారణాలు అలాగే వుంటాయి మరి).
నేను: హ హ... జేబు రుమాలు వొద్దా ?
వాడు: జోకులు వొద్దు !!!! చెప్పేది సీరియస్ గా విను.
(మా వాడు తన రీసెంట్ లవ్ స్టొరీ చెప్పాడు... ఆ స్టొరీ మొత్తం ౩ నెలల్లో జరిగింది.. ఆ టైం లో నేను ఇండియా లో లేను)
నేను:నాకు కొంచం సరిగ్గా అర్థం కాలేదు రా...నేను కొన్ని డౌట్స్ అడగనా ?
వాడు: ప్రేమించాను అన్నపుడు,... ఎప్పుడు అని ........... వదిలేసింది అంటే,... ఎందుకు అని మాత్రం అడగకు ....... ఎందుకంటే, మొదటి దానికి నా దగ్గర, రెండో దానికి తన దగ్గర జవాబులు లేవు....(ఆ తర్వాత నా దగ్గర అడగటానికి ప్రశ్నలు లేవు).

మా వాడు స్టొరీ మొత్తం చెప్పి ఏడవలేక, నవ్వటం స్టార్ట్ చేసాడు. వాడు స్టొరీ స్టార్ట్ చేసినప్పుడు కామెడీ గా అనిపించి, కష్టపడి నవ్వుని ఆపుకున్నాను. అదే స్టొరీని ఎండ్ చేసినప్పుడు అంతే కష్టంతో నవ్వటానికి ట్రై చేశాను. మా ఫ్రెండ్ షారుక్ ఖాన్ లాంటి వాడు..... వాడు నవ్వుతూ, ఎదుటి వాళ్ళను ఏడిపించగలడు.... నేను ముందే చెప్పా కదండీ, వాడు "so expressive" అని.

అమర ప్రేమలన్నీ అల్లరి తోనే స్టార్ట్ అవుతాయి అని ఒక నానుడి..... అందుకేనేమో అందమైన అమ్మాయిలందరూ అల్లరి చేసే అబ్బాయిలకి పడిపోతారు......అందుకే లైఫ్ లో యాక్టివ్ గా, లవ్ లో హైపర్ యాక్టివ్ గా వుండే మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు......అబ్బాయిలు ఎప్పుడు "fast & furious" గా వుండి, కొంచం "cute & curious" గా వున్న అమ్మాయి కనిపించగానే,వెంటనే వెళ్లి ' ప్రేమించుకుందాము రా!!! ' అనేలా వుండాలి. అలా కాకుండా, " రబ్ నే బనాది జోడి" అనుకుంటే, ఆ తర్వాత, ఆ లైఫ్ సినిమా లా కాకుండా సీరియల్ లా వుంటుంది అని చెప్పాడు.

ఈ వీకెండ్ లో కూర్చుని, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో ఒక పేపర్ మీద రాసుకోవాలి అని మా రూం మేట్ అన్నాడు...నేను, " ఎందుకు ?" అని అడిగాను....అలాంటి అమ్మాయి దొరికితే ప్రేమించి, కుదిరితే పెళ్ళి చేసుకోవటానికి అన్నాడు....పెళ్ళి కోసం అలా లిస్టు అవుట్ చేసుకుని, వర్క్ అవుట్ చేయ్యోచేమో కాని, ప్రేమించటానికి కూడా అలాంటి లిస్టు ఒకటి ప్రిపేర్ చేసుకోవాలా అని డౌట్ వచ్చింది. If you feel that you are loving a person by her unique qualities then tell me that you are loving her........But if you love a person who is having the qualities that you want in a girl, then dont tell me you are loving her,....... bcoz,...... you are not loving her, instead, you are respecting your feelings by findng a " human representation" of it. అని ఆవేశంగా చెప్దాం అనుకున్నాను.... పిల్లోడా!!!!, సినిమా డైలాగులు చెప్పకు అని ఒక లుక్ వేస్తాడెమో అని చెప్పలేదు. కోతి ముందు కుప్పిగంతులు వెయ్యకూడదు అని నాకు కూడా తెలుసు...

ఇంతకీ నేను ఏమి చెప్పాలి అనుకున్నానో మీకు అర్థం అయ్యిందా ?.... అర్థం అవ్వక పోతే మల్లి చదవండి...అర్థం ఐతే, ZTS స్పేస్ YES అని టైపు చేసి 8756 కి SMS చెయ్యండి.

ప్రేమంటే పాము లాంటిది అని,అది పెరిగి పెద్దయ్యాక ఏదో ఒక రోజు కాటు వేస్తుంది అని, అప్పుడు ప్రేమ కాటు కు స్కాట్చ్ దెబ్బ అవసరం అని నేను చాల మంది దగ్గర విన్నాను. భాద పోవడానికి బీరు, వైరాగ్యం పోవటానికి వైన్ , విసుగు పోవటడానికి విస్కీ అవసరం లేదా అని అడగకండి...ఎందుకంటే, ఏ రాయి ఐతే ఏముంది, పళ్ళు రాలగొట్టుకోవటానికి.

ప్రేమంటే చిగురాకు లా వుండాలి కాని, చిరాకు లా ఉండకూడదు. అది అలా వుండాలి అంటే, అమ్మాయిలకి, compliments లా వుండే కామెంట్స్........కలిసినప్పుడు 'comfort'ness...... 'కలిసే వుంటాం' అనే confidence ఇస్తే చాలు.... ఓస్ ఇంతేనా అనుకోకండి.....ఆ Comfort లోనే వుంది Infinite.

ఏంటి ?? ....అబ్బాయిలకి ఏమి కావాలో చెప్తాను అని వెయిట్ చేస్తున్నారా ?.... నాకు ఏమి కావాలో చెప్పి, ప్రతి అబ్బాయి, అదే కోరుకుంటాడు అని చెప్పేంత ఫూల్ ని కాదు.Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7318634243543500551.post-70799772987098948172009-09-11T21:07:00.003+05:302009-09-11T21:19:07.533+05:30Hats off to you YSRNo... I am not fan of YSR...... "కడప లో బాంబుల రెడ్డి మల్లి గెలిచాడు". తెలుగు దేశం ప్రబంజనం లో కాంగ్రెస్ హేమాహేమీలు కూడా ఓడిపోయినప్పుడు, అభిమానులు "పులివెందుల పులి" గా పిలుచుకునే ఆ వ్యక్తి గురుంచి ఈనాడు పేపర్ లో రాసిన ఆర్టికల్ చదువుతూ మా వూరిలో పెద్ద వాళ్ళు అనుకుంటూ వుండగా నేను మొదటి సారి YSR గురుంచి చదివాను....( అప్పుడు నేను 4th క్లాసు చదువుతున్నాను..... అర్థం అయ్యినా, అవ్వక పోయినా , రోజూ news paper చదవాలి అనేది మా ఫాదర్ నాకు పెట్టిన రూల్.). అప్పట్లో చిరంజీవి (కొండవీటి దొంగ, కొదమ సింహం లాంటి, etc...)సినిమాలు చూసి, గుర్రాలు, గన్నులు, బాంబులు అంటే మంచి ఇంట్రెస్ట్ వుండేది. అందుకే బాంబుల గురుంచి ఏమైనా రాసారేమో అని చాల ఉత్స్తాహంతో చదివాను...చదివాకా అర్థం అయ్యింది.... బాంబుల రెడ్డి అనేది మా వూరిలో వాళ్ళు పెట్టిన పేరు అని.

మొదట్లో ఒక ఫ్యాక్షనిస్ట్ గా, గ్రూప్ రాజకీయాల నేత గా, ఆల్వేస్ అసమ్మతి నాయకుడి గా వున్న ఆయన, ఆ తర్వాత కాలంలో చాల మారిపోయాడు అని అంటారు. చంద్రబాబు హయాంలో ప్రతి పక్ష నేతగా వున్నప్పటికీ, బాబు తన హైటెక్ ట్రిక్స్ తో జనాలని తన వైపు తిప్పుకోవటం లో సఫలం అవ్వటంతో, అప్పుడప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల టైం లోను, అడపాదడపా వచ్చే మిమిక్రీ షో టైం లోను తప్ప జనాలకి YSR గుర్తువుండటం తక్కువే.

పాదయాత్ర చెయ్యమని సలహా ఎవరు ఇచ్చారో కానీ అది నిజంగా YSR జీవితాన్ని మార్చేసింది. మొదట్లో ఆ సలహా ఇచ్చిన వ్యక్తి కి "What an Idea sir ji" అని YSR థాంక్స్ చెప్తారేమో అనుకున్నాను, కానీ ఆ థాంక్స్ మన రాష్ట్ర ప్రజలు చెప్పుకునేలా చేసాడు. పాదయాత్ర తో "మనకు ఇలాంటి నాయకుడు కావాలి" అనుకునేలా చేసిన ఆయన, ఆ తర్వాత తన పరిపాలనతో, పధకాలతో "మనకు ఇలాంటి నాయకుడు మాత్రమే కావాలి" అనుకునేలా చేసాడు.

NTR తర్వాత అంతటి ఇమేజ్ వున్న(సంఖ్యా పరంగా అంతకంటే ఎక్కువే) హీరోగా చిరంజీవి రాజకీయ ప్రవేశం, చంద్రబాబు హైటెక్ హామీలు, మహాకుటమి పేరుతో పరిమిత'కాల కూటమి' లాంటివి ఏమి కూడా YSR ని ఆపలేకపోయాయి. కాంగ్రెస్ కి పడిన ప్రతి ఓటు YSR ను చూసి వేసారు అని చెప్పటం లో ఏ మాత్రం సందేహం లేదు.

చిరంజీవి సభలకి వచ్చిన జనం YSR సభలకి రాలేదు, బుడ్డోడు(Jr.NTR) ప్రసంగాల కోసం ఎగబడిన జనం YSR ప్రసంగాల కోసం ఎదురు చూడలేదు, ఐనప్పటికీ, జనాలకి YSR మీద వున్న నమ్మకం మిగిలిన వాళ్ళ మీద లేదు. ఐనా ప్రచారం లో ఎవరి స్టైల్ వారికీ వుంటుంది.YSR ని తమకు ప్రధాన పోటీగా భావించిన చిరంజీవి పులివెందుల లో తోడ కొట్టాడు. NTR ఫ్యామిలీ కి ఆ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే పోటి అని భావించిన బాలకృష్ణ, కారంచేడు లో అక్క ఇంటి ముందు తోడ కొట్టాడు. అసలు వీళ్ళు ఎవరు తనకు పోటి కాదు అనుకున్న YSR మొగల్తూరు లో " Flying kisses " తో ప్రేమను పంచటానికి ట్రై చేసారు.

మొదట ముక్కోపి గా పేరు వున్నపటికి, తర్వాత తనలో ఆ కోపం నరం తెగిపోయింది అని చెప్పే అయన, తను చేసే కొన్ని పనులు చూస్తే, నిజమేనేమో అనిపిస్తుంది. మాకు 290 సీట్లు వస్తాయి అని అల్లు అరవింద్ చెప్పినప్పుడు, వంద రోజుల్లో YSR ని ఇడుపులపాయలో కుర్చోబెడతా అని చంద్రబాబు ప్రతిజ్ఞ చేసినప్పుడు, YSR ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి లైట్ తీసుకున్నాడు. చంద్రబాబు ని దొంగబాబు అని పిలిచి కామెడీ చెయ్యటం ఆయనకే చెల్లింది. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఎంతో ఆవేశంతో ఎన్నో ఆరోపణలు చేసినప్పుడు, ఒక నవ్వు నవ్వి, " ఊరుకోవయ్య చంద్రబాబు... నువ్వు కూడా మాకు చెప్తున్నావా" అని తన స్టైల్ లో చెప్పినప్పుడు చూస్తున్న వారు " TOM & JERRY " షో లా ఎంజాయ్ చేసారు.

ఒక వ్యక్తి మరణించాడు అని ఆ షాక్ తో లేదా భాధ తో 350 మంది పైగా మరణించటం నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడా చదవలేదు. ఆంధ్ర లో ప్రతి ఇంట్లో కూడా, పార్టీలకు అతీతంగా, తమ సొంత వ్యక్తి ని కోల్పోయినట్లు భాదపడటం కూడా ఎప్పుడూ చూడలేదు. రాజకీయాలలో ఆరోపణలు సాదారణమే అయినప్పటికి, ఎంత నిజమో, ఎంత అబద్దమో తెలియని జనం మాత్రం కన్ఫుజ్ అవుతుంటారు... అదే విధంగా, YSR మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.... అవి నిజమే అవ్వోచ్చేమో. కానీ ఒక మంచి నాయకుడిని, పేదల కష్టాలు తెలిసిన & తీర్చగలిగిన ఒక మంచి ముఖ్యమంత్రి ని మనం కోల్పోయాము అనేది మాత్రం నమ్మలేని, నమ్మటానికి ఇష్టపడని ఒక చేదు నిజం.

May his soul rest in Peace.Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7318634243543500551.post-34495234620796198782009-06-22T20:28:00.004+05:302009-06-25T07:47:20.940+05:30Few precious days
హెన్ లేదు, ఎగ్ లేదు, చిక్ పేరు చక్రి అన్నాడంట వెనకటికి ఒకడు...... కొరియా లో కంప్యూటర్ లో కేశినేని ట్రావెల్స్ లో భాగ్యనగరం నుంచి బెంగలూరు కి టికెట్ బుక్ చేస్తూ నేను కూడా అలాగే అనుకున్నాను.... ఎందుకంటే నేను ఇండియా కి వచ్చే డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు..... ఇండియా కి వచ్చాక ఆఫీసు లో ఫార్మాలిటీస్ పూర్తిచేసి,బెంగలూరు నుంచి విజయవాడ(ఆ పక్కనే వున్న ఘంటసాల) వెళ్లి, క్రిస్మస్, జనవరి 1st కి ఇంట్లో వుండి, ఆ తర్వాత హైదరాబాద్ లో ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి, 3 రోజుల తర్వాత బెంగుళూరు బయలుదేరటానికి నేను <wbr>ఇప్పుడు టికెట్ బుక్ చేసింది. ఈ రౌండ్ ట్రిప్ లో ఈ టికెట్ తప్ప ఏ టికెట్ బుక్ అవ్వలేదు.

ఆ తర్వాత నేను ఇండియా రావటం, ఇంటికి పోవటం, వేగంగా జరగటంతో..... ఆ పల్లెటూరిలో కూర్చుని ప్రశాంతమైన గాలి పీల్చుకున్నా. ఆ ప్రిషియస్ డేస్ లో ఫెస్టివల్ చేసుకుని, హైదరాబాద్ హమారీ జాన్ అనుకుంటూ పయనం అయ్యాను.

జీవితం లో కొన్ని సంబంధాలు,కొన్ని సంధర్భాలు ఎప్పటికి స్పెషల్ గానే వుంటాయి. గతంలో కన్నీళ్ళు వచ్చిన సంధర్భాలు తలచుకుంటే ప్రస్తుతం నవ్వు రావచ్చు. ఇలాంటివి ఎప్పుడు కేవలం మన మీద మాత్రమే ఆధారపడి వుంటాయి. ఆ టైం లో నేను అంత సున్నితంగా లేదా చిన్నపిల్లాడిలా ఎలా వున్నాను అని నవ్వుకుంటాము. example చెప్పనా...చిన్నపుడు అక్క తోనో, తమ్ముడి తోనో తిండి విషయం లో తగువులు, అలకలు గుర్తు వున్నాయా ?...అవి గుర్తు వస్తే ఇప్పుడు నవ్వు వస్తుంది కదూ........ కాని...... గతంలో నవ్విన సందర్బాలు తలచుకున్న్నపుడు, ప్రస్తుతం కళ్ళ వెంట నీళ్ళు వస్తే మాత్రం అది మనతో పాటు, పక్కన వున్న వాళ్ళ మీద కూడా ఆధారపడి వుంటుంది. ఆ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నామనో, అలాంటి రోజులు చాల మిస్ అవుతున్నామనో లేదా అలాంటి రోజులు మళ్లీ రావు అనో...... దీనికి కూడా example చెప్పనా.... ఒక సారి కాలేజీ డేస్ ని, farewell functions ని, ఫ్రెండ్స్ తో హ్యాపీ మొమెంట్స్ ని గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి మొమెంట్స్ లో మనతో వున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు స్పెషల్ గ మిగిలిపోతారు.....నేను ఇప్పుడు అలాంటి ఫ్రెండ్ దగ్గరకే వెళ్తున్నాను... స్టొరీ కాకుండా షార్ట్ గ చెప్పమంటే, He is my Best Friend.

అయ్ బాబోయ్, సడన్ గ ఇంత క్లాసు పీకేసాను ఏంటి ?..... ఏమి లేదండి .... నాకు గంగూలీ గుర్తొచ్చాడు.. తను ముందుకొచ్చి కొట్టిన షాట్లు, మనసు విప్పి చెప్పిన మాటలు ఎప్పటికి గుర్తు వుంటాయి.... ఏమి చెప్పాడా అనా మీ డౌట్...... " చార్ జీతోం ... చార్ దోస్తోం "..

హ్యాపీ గ రెండు రోజులు హైదరాబాద్ లో రౌండ్లు కొట్టాను. రాకింగ్ రైడింగ్ పేరు చెప్పి మా వాడు రేసింగ్ డ్రైవ్ చేస్తుంటే నాకు వీడియో గేమ్ ఆడుతున్నట్లు అనిపించేది.... ముడో రోజు నా ఫ్రెండ్ తో కలసి తన కాబోయే వైఫ్ ని కలవటానికి వెళ్ళాను. వాడి టెన్షన్ చూసి వైఫ్ దగ్గరకు వెళ్తున్నామో లేక నైఫ్ దగ్గరకు వెళ్తున్నామో అర్థం కాలేదు, తనని కలిసాక మాత్రం నైఫ్ కాదు నైస్ అని అర్థం అయ్యింది....మన బాష లో Made for each other లా, కృష్ణ మూవీ లో సునీల్ స్లాంగ్ లో, చూడటానికి పార్వతి పరమేశ్వరులు లానే వున్నారనిపించింది.

ఏదైనా తినాలి అనిపిస్తే లంచ్ చేసి... ఏమినా కొనాలి అనిపిస్తే షాపింగ్ చేసి... ఆపై ఏమి చెయ్యాలో తెలియక టైం పాస్ చేసి... పని లేక కొన్ని ఫన్నీ ప్లాన్స్ వేసి... మొత్తం మీద బాగా ఎంజాయ్ చేసి...ఆ తర్వాత రూం కి వచ్చి... నా ప్రయాణానికి సమయం అయ్యిందని గ్రహించి... నేను నా ఫ్రెండ్ స్టార్ట్ అయ్యాము.

తార్నాక లో కొంచం దూరం వచ్చాక ఒకడు కనిపించాడు.... ఎర్రగడ్డ హాస్పిటల్ లో వుండాల్సిన వాడు ఎందుకు రోడ్ మీద వున్నాడో అర్థం కాలేదు.చేతిలోని రాళ్ళని, సిటి బస్సు మీద వేస్తూ మా బండి కి అడ్డంగా వచ్చాడు.ఆ షాక్ లో మా ఫ్రెండ్ బ్రేక్ వెయ్యటం మర్చిపోయాడు.వెంటనే మేము వాడికి చిన్నగా డాష్ ఇవ్వటం,మా బైక్ ఆగటం ఒకేసారి జరిగాయి.

వాడిని చుస్తే ముస్లిం లా,ఆ ఏరియా కూడా ముస్లిం ఏరియా లా అనిపించింది.దానితో మేము ఆ భాగ్యనగరం లో అభాగ్యులము అయ్యేలా వున్నమేమో <wbr>అనిపించింది.ఒక వైపు వాడికి అసలు దెబ్బలు తగలకపోయినా,ఏదో విరిగి<wbr>పోయినట్లు యాక్ట్ చెయ్యటం స్టా<wbr>ర్ట్ చేసాడు,ఇంకో వైపు,మా చుట్టూ జనాలు చేరటం స్టార్ట్ చేసారు.వాడికి తగలని దెబ్బలకి మమ్మల్ని డబ్బు<wbr>లు అడిగితే,మేము ఇవ్వటానికి రెడీ అవుతుండగా,ఆ పక్క షాప్ అంకుల్ వచ్చి ఆపాడు....తప్ప తాగి,బస్సు మీద రాళ్ళు వేసి,రో<wbr>డ్ కి అడ్డం గ నడిచి,బండి కి అడ్డం వచ్చి, తప్పు తన వైపు పెట్టుకుని,మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నావు అని వాడిని నిలదీశాడు.ఇంతలొ అక్కడ వున్న జనం కూడా మాకు సపోర్ట్ గ మాట్లాడటం తో,వాడు మమ్మల్ని వదిలేసాడు.భాగ్యనరం లో ఇంకా షాప్ అంకుల్ లాంటి మంచి వాళ్ళు వుండటం వల్లే, దౌర్బ్గా<wbr>గ్యనగరం కాలేదు అనిపించింది.

మా ఫ్రెండ్ కి బై చెప్పి, బస్సు ఎక్కాను. అప్పటికే నా పక్క సీట్ లో ఒక అమ్మాయి వుంది. పేస్ అమ్మాయి లానే వున్నా, డ్రెస్ మాత్రం అబ్బాయిది లా వుంది.బస్సు బాయ్ వచ్చి,నన్ను వెనుక ఎక్కడో కూర్చోమన్నాడు. నేను నా సీట్లోనే కుర్చుంటాను, ఆ అమ్మాయిని వెనుక కూర్చోమని చెప్పు అన్నాను... ఆ అమ్మాయి నా వైపు ఒక లుక్ వేసి "పర్లేదు మనం ఇద్దరం కూర్చుందాం" అంది. అబ్బాయి పక్కన కుర్చుని తను రిస్క్ చేసిందేమో అనుకున్నా..... కాని ఆ రిస్క్ నాకు అని త్వరగానే అర్థం అయ్యింది.

తన పక్కన వెళ్లి కూర్చోగానే, స్పిరిట్ స్మెల్ వచ్చింది.తను తాగి వచ్చిందేమో అని డౌట్ కూడా వచ్చింది. టీవీ లో మూవీ వస్తుంది, తనకు మాత్రం సీరియస్ సీన్ లకు కూడా నవ్వు వస్తుంది. నాగార్జున మూవీ అవ్వటంతో నేను కూడా చూస్తూ వున్నాను. మా ఇద్దరి మధ్య వున్న హ్యాండ్ రెస్ట్ మీద తను కొంచం, నేను కొంచం ప్లేస్ లో హాండ్స్ పెట్టుకుని కూర్చున్నాం. రోడ్ మలపులకో,బస్సు బ్రేక్ లకో, స్పీడ్ బ్రేకర్స్ స్టాప్ లకో, నా చెయ్యి కొంచం తగలగానే, ఎమర్జెన్సీ సైరన్ లా 'excuse me' అనేది. కొంచం సేపటికి ఇద్దరం నిద్ర పోయాము.

ఎప్పుడో 'excuse me' అని సౌండ్ వినపడటంతో మెలకువ వచ్చింది. సేం రీజన్, సేం సైరన్. నాకు అలా నిద్ర పట్టటం, తను ఇలా నిద్ర లేపటం చాల సార్లు జరిగింది.టైం 2 అయ్యింది.ఆ నైట్ నాకు నరకం చూపించటానికి డిసైడ్ అయినట్లు వుంది. నాలో సహనం పోయి ఆ ప్లేస్ లో స్లీప్ రిప్లేస్ అవుతుంది. ఫైనల్ గ తనతో ఇలా చెప్పాను... " ఏమండి, మిమ్మల్ని టచ్ చేసే వుద్దేశం నాకు లేదు... ఇక నుంచి, ఏమైనా టచ్ ఐతే... మీరు మంచి వాళ్ళు ఐతే కొంచం అటు జరపండి...లేదు అంటే విసిరి కొట్టండి...నన్ను మాత్రం నిద్ర లేపకండి" అని వేరే సైడ్ తిరిగి నిద్రపోయా.... ఆ తర్వాత నాకు ఆ సైరన్ సౌండ్ వినిపించలేదు.

మార్నింగ్ లేచిన తర్వాత తన వంక చూసా...రాత్రి కన్నా కొంచం బెటర్ గ అనిపించింది. క్యాజువల్ గ మాటలు కలిసాయి. కరెక్ట్ గ నేను దిగిపోయే ముందు, డేర్ చేసి తనని అడిగా... ఏమండి నిన్న నైట్ డ్రింక్ చేసి స్టార్ట్ అయ్యారా అని ... తన పేస్ కన్ఫుసింగ్ గ పెట్టింది.... నిన్న నైట్ స్పిరిట్ స్మెల్ వచ్చింది అని చెప్పా... తను షర్టు స్లీవ్ పైకి లాగింది... లాగిపెట్టి కొడుతుందేమో అని అందనత దూరం జరుగుదాం అనుకున్నా.... అప్పుడు కనిపించింది ... తన హ్యాండ్ కి ఒక వౌండ్, దానిపై టించర్ తో ఒక బ్యాండ్.

Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7318634243543500551.post-27538483927866746872009-06-05T20:21:00.005+05:302009-06-05T20:43:58.071+05:30ప్రయాణం - A trip to HogenikalIPL అయ్యిపోయాక, TV లో ఇంటరెస్టింగ్ గా చూడటానికి ఏమి లేక, తేజ ఛానల్ లో తమ్ముడు మూవీ చూస్తున్నా.ఒక సీరియస్ సీన్ వస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ లో 'వేళా పాలా లేకుండా' సాంగ్ వస్తుంటే,నేను వెళ్లి మొబైల్ లో కాల్ అటెండ్ చేశా... కన్ఫుజ్ అవ్వకండి, ఆ సాంగ్ తమ్ముడు మూవీ లోదే అయ్యినా, అప్పుడు వచ్చింది మాత్రం నా మొబైల్ నుంచి. ఎందుకనగా అది నా రింగ్ టోన్ కనుక.

నాకో చిన్నప్పటి ఫ్రెండ్ వున్నాడు....వాడికి నేనంటే ఒక పెద్ద అభిప్రాయం కూడా వుంది... నాకు కొంచం బలుపు అని, అందువల్ల నేను ఫ్రెండ్స్ ని కలవాలి అనుకున్నపుడు, వాళ్ళని నా దగ్గరకు రమ్మంటాను అని, నేను మాత్రం వాళ్ళ
దగ్గరకు రానంటాను అని వీడి నమ్మకం. బద్దకాన్ని, బలుపు అనుకునే అమాయకత్వం వాడిది.

తను కాల్ చేసి,రేపు కలుద్దాం, కలసి హొగెనకల్ వెళ్దాం అన్నాడు... సరే అని కాల్ కట్ చేశా. నార్మల్ గా వీకెండ్ అనగానే, ఒక ఫెవికాల్ బాటిల్ తీసుకుని, కొత్తగా కొన్న కుర్చీ సీట్ కో, లేక నా బెడ్ కాట్ కో పూసుకోవటం నాకు అలవాటు... ఈ వీకెండ్ కి మాత్రం కుర్చీ సీట్ కి, బెడ్ కాట్ కు కాకుండా,నా హార్ట్ కి రాసుకుని, డేఫనేట్ గా వాడితో హొగేనికల్ వెళ్దాం అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యా.

ఈగర్ గా ఎర్లీ మార్నింగ్ లేచి, హడావిడి గా రెడీ అయ్యి,మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పులేసుకుని,చెప్పిన చోటకి వెళ్ళాను..నేను వెళ్ళిన కొంచం సేపటికి మా ఫ్రెండ్ వచ్చాడు...తను తమిళనాడు తరలి వెళ్ళటంతో తనని కలసి చాల కాలం అయ్యింది... నన్ను చూడగానే సినిమా హీరో లా వున్నావురా అన్నాడు. తమిళనాడు లో వుంటున్నాడు
కదా, పితామగన్(తెలుగు లో శివపుత్రుడు ), సుబ్రమణ్యపురం(తెలుగు లో అనంతపురం) లాంటి సైకో సినిమా ఏదో తీసే ప్లాన్ లో వున్నాడేమో అనుకున్నా.

మిగిలిన ఫ్రెండ్స్ తో పరిచయాలు ఐన తర్వాత, మొత్తం 8 మంది కలసి జోరుగా జర్నీ స్టార్ట్ చేసాము...కింగ్ ఫిషర్ ఫ్లైట్ ప్రయాణం లో ప్రికాషన్స్ ఇస్తున్న మాల్యా లా, మా ఫ్రెండ్ తన రైడింగ్ గురుంచి రూల్స్ చెప్పాడు. ఎంతైనా మా ఫ్రెండ్ ది విశాల హృదయం. వాడు ఎలాంటి రోడ్ మీద ఐన ఒకేలా రైడ్ చేస్తాడు. గుంటల్ని, గుట్టల్ని సమానంగా చూసే సహృదయుడు వాడు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ కాకుండా స్పీడ్ మాత్రమే వాడతాడు. బైక్ కి కూడా సీట్ బెల్ట్ అవసరం అనుకునేలా చేసాడు వీడు.

మా ఫ్రెండ్ మంచితనానికి ముచ్చటపడి ముద్దు పెట్టుకోవాలనుకుందేమో, సిల్క్ బోర్డ్ రోడ్ స్లిప్ చేసింది. ఆ స్కిడ్డింగ్ కి ఇద్దరం రోడ్ కి అడ్డంగా పడ్డాం. తగిలిన దెబ్బలు చిన్నవే అవ్వటంతో అవి పెద్ద భయాన్ని మాత్రం క్రియేట్ చెయ్యలేదు. ఐనా నాది మాములు హార్ట్ కాదు కదా.... ఫెవికాల్ రాసుకున్న హార్ట్. అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది, మేము హొగెనకల్ చేరటానికి చేసేది ప్రయాణం కాదు ప్రయత్నం మాత్రమే అని.

అలా మొదలై, అత్తిబలి దాటాక ఆకలి అనిపిస్తే తమిళ్నాడు లో అడుగు పెట్టాక టిఫ్ఫెన్ తిన్నాము. నల్ల రంగు లో రోడ్సు,
నీలి రంగులో క్లౌడ్సు, పచ్చ రంగులో ప్లాంట్స్ తో ప్రతి సీన్ ఒక సీనరి లా ఓవర్ ఆల్ గ గ్రీనరీ లా అనిపించింది.అలాంటి ప్రశాంతమైన వాతావరణం లో పరుగులు పెడుతున్న వాహనాలపై వెళ్తూ,అలుపు అనిపించినప్పుడు అనుకూలమైన ప్లేస్ లో ఆగుతూ,ఆగిన చోట ఫోటోలు దిగుతూ మా పయనం సాగించాము.ఘాట్ రోడ్లు,గతుకుల రోడ్లు దాటి హొగేనికల్ చేరాము.

ఒక హోటల్ (పేరు తమిళనాడు)కి వెళ్లి భోజనం చేసాము.మార్నింగ్ టిఫ్ఫెన్,మధ్యానం మీల్స్ తర్వాత నాకు 2 విషయాలు అర్థం అయ్యాయి. (మొదటది), తమిళ్ హోటల్స్ లో సాంబార్ భావుంటుంది అని, ( రెండోది), సాంబార్
మాత్రమే భావుంటుంది అని.ఆ తర్వాత చిన్నపాటి తెప్పలు 2 తీసుకుని ఫాల్స్ చూడటానికి స్టార్ట్ అయ్యాము. ఆ తెప్పలు నడిపేవాడు మాకు కర్ణాటక ఫాల్స్,తమిళనాడు ఫాల్స్ చూపిస్తాను అంటే,అవి ఎంత దూరమో అనుకున్నాము,అక్కడకి వెళ్లి చూసాక తెలిసింది,పక్క పక్కనే వున్న ఫాల్స్ ని ఈ పక్క రాష్ట్రాల వాళ్ళు పంచుకున్నారు అని.

ఆ జలపాతం కిందకి వెళ్ళినప్పుడు,మా తాపం తీరేలా వాటర్ మీద పడుతుంటే అద్భుతం లా అనిపించింది.అక్కడ కొండల మీద నుంచి కాలువ లోకి దూకుతున్న పిల్లల్ని చూసి ఆశ్చర్యం అనిపించింది.ఆ పక్కనే వున్న ఐ-ల్యాండ్ లోకి వెళ్లి,వాటర్ లో ఆడుకుంటూనపుడు అనందం గా అనిపించింది.అలా ఒక గంట ఆడాక అలసట గా అనిపించింది.అటు వెళ్లి మెయిన్ ఫాల్స్ ని చూసినప్పుడు అమేజింగ్ అనిపించింది.

అలా అన్నిరకాల అనుభూతుల్ని మూట కట్టుకుని, తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. మధ్యలో కురిసిన వర్షంతో మా అందరి మీద నీళ్ళు కారాయి కాని మా ఆనందం మాత్రం నీరు కారలేదు. ఆ చిరు జల్లుల్లో సేఫ్ గా రూం కి చేరటంతో మా హొగెనకల్ ప్రయాణం(పయత్నం) పూర్తి అయ్యింది.Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7318634243543500551.post-30685767837228709652009-05-23T15:43:00.000+05:302009-06-05T18:20:12.446+05:30One funny incident
అవి నా 10th క్లాసు వేసవి సెలవల రోజులు. ఖాలిగా వుండటం కంటే, కోచింగ్ కి వెళ్ళటం బెటర్ అని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కి జాయిన్ అయ్యాను. ప్లేస్ మా పిన్ని వాళ్ళ వూరు అవ్వటం తో నేను డే-స్కాలర్ని అయ్యాను.

మా అమ్మ శాంతం ఐతే మా పిన్ని సూర్యకాంతం. బుక్స్, రూల్స్ అని నస పెట్టినా, నేను చేసే అల్లరి మాత్రం మా పేరెంట్స్‌కి ఎకరువు పెట్టేది కాదు. తనకి ఒక్కటే కూతురు అవ్వటం వల్ల నన్ను సొంత కొడుకు లా చూసుకునేది. బై బర్త్ వచ్చిన బద్ధకం వల్ల నేను క్లాసు కి ఎప్పుడు లేట్గ వెళ్ళేవాడిని, ఇంటికి మాత్రం త్వరగా వచ్చేవాడిని.

ఆ వూరిలో నాకొక ఫ్రెండ్ వుండేవాడు.. వాడు మాకు దూరపు బందువు కూడా. కాని నేను వాడితో సావాసం చెయ్యటం మా పిన్నికి ఏమాత్రం ఇష్టం లేదు. మన పిల్లలు పసివాళ్ళు, పక్కింటి పిల్లలు పోకిరి వాళ్ళు అనుకోవటం ప్రతి తల్లి కి అలవాటు !!!.

తొలకరి కి తొందరపడ్డ వర్షం లా నేను త్వరగా వస్తే, ఎండాకాలం వడగాలి లా వాడు ఎప్పుడు ఇంటి దగ్గరే తిరుగుతూ వుండే వాడు. ఇద్దరం కలిసి ఎండా , వాన తేడ తెలియకుండా క్రికెట్ ఆడేవాళ్ళం. నేను వచ్చింది క్రికెట్ కోసమో, కోచింగ్ కోసమో తెలియక మా పిన్ని కన్ఫుజ్ అయ్యేది.

ఆ ' గాలి ' తో తిరుగుడు భరించలేని మా పిన్ని, చల్లని కోలా నాకు ఇచ్చి,చిన్నగా క్లాసు తను తీసు<wbr>కుంది. నేను మార్గదర్శి లో చేరాను, మా పిన్ని కి ఒక స్టొరీ చెప్పాను. " భారత దేశం లో టాప్ 10 విష సర్పాల్లో 7 కర్ణాటక లోనే వుంటాయి అంట. అవి కర్ణాటక లోని గంధం చెట్లకు చుట్టుకుని <wbr>వుంటాయి అంట ఎందుకంటే అక్కడి పాములు, గంధం చెట్లు మంచి ఫ్రెండ్స్ ... ఎన్ని ఎక్కువ పాములు చుట్టుకుని వుంటే, ఆ చెట్టు గంధం అంత మంచిది అని అక్కడి గంధంపు దొంగల నమ్మకం. కాని ఎంత కాలం కలసి వున్నా, ఆ చెట్ల లోని గంధం ఆ పాముల్లోకి రాదు, ఆలాగే పాములోని విషం గంధం లోకి వెళ్ళదు .... అదే విధంగా మన చుట్టూ ఫ్రెండ్స్ ఎలా వున్నా, మనం కరెక్ట్ గ వుంటే ఏమి అవ్వదు" అని చెప్పా. నా స్టొరీ విన్న ఆ తల్లికి గొంతు మూగపోయింది, నా చెల్లి కి వస్తున్నా నిద్ర ఆగి పోయింది.

అప్పటి నుంచి " చూసి వెళ్ళాలి, షూస్ వేసుకేల్లాలి " లాంటి రూల్స్ లేకపోవటం తో నా పని 3 కోచింగ్ క్లాస్స్లు 6 క్రికెట్ మ్యాచ్ లా వుండేది. మా పిన్ని కూడా ' మా అబ్బాయి చాల మంచోడు' అనుకునేది. సడన్ గ మా చుట్టాలబ్బాయి నాకు చుక్కలు చూపించాడు.వాడు ఎవరి మీద రాయి వేసిన దెబ్బ మాత్రం నాకే తగిలేది.... వాడి తప్పులు ... నాకు అప్పులు .... వాడి గొప్పలు .... మాకు తిప్పలు... వాడి పాపాలు... మాకు శాపాలు. ఫలితంగా లైఫ్ లో ఇలాంటి మిత్రుడు పక్కన వుంటే శత్రువులు వుండాల్సిన అవసరం లేదు అనుకునేలా చేసాడు.

కోచింగ్ లో వీక్లీ టెస్ట్‌లు బోర్ గ వుండేవి... టాప్ 10 రాన్కర్స్ లిస్టు బోర్డు మీద వుండేది. కొన్ని సార్లు నాకు <wbr>1st రాంక్ వచ్చేది.... మా సర్ కి మాత్రం క్రాక్ వచ్చేది..నేను చిన్నప్పుడు మంచి వాడిని అని( మా సర్ అండ్ మా పెదన్నాన్న ఫ్రెండ్స్ సో నేను మా సర్ కి చిన్నపాటి నుంచి తెలుసు)... ఈ మధ్య ఎక్ష్త్రాలతొ ఎదవలా అయ్యా<wbr>ను అని ఆయనకు నా మీద చాల కోపం వుండేది అందుకే కనిపించిన ప్రతిసారీ తిడుతూ వుండేవాడు.... అందుకే నేను ఆయనకు కనిపించకుండా తిరుగుతూ వుండేవాడిని.

కోచింగ్ లో నాకు ఒక ఫ్రెండ్ వుండేవాడు... వాడు చాల మంచి వాడు. పది రోజుల్లో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యిపోయాము. అలాగే పద్దు అని ఒక అమ్మాయి వుండేది... అందంగా అమాయకంగా అణకువగా వుండేది... కనిపించినప్పుడు నాకు ఒక స్మైల్ ఇచ్చేది... నాకు ఎవరినా స్మైల్ ఇస్తే ఇష్టం వుండదు అందుకే తన స్మైల్ తనకి తిరిగి ఇచ్చేవాడిని.

ఆ రోజు ఫైనల్ ఎక్షామ్ రాయటానికి విజయవాడ వెళ్ళాము.. ఎక్షామ్ రాసాము...రాంక్ ఎంత వస్తుంది అని మా సర్ అడిగారు.... నేను ఆలోచించి ఐదు వేలు లోపు వస్తుంది అన్నాను....అయన అలోచినకుండానే అక్షింతలు వేసారు.... మా ఫ్రెండ్ ఒకడు వాడికి 100 లోపు వస్తుంది అని చెప్పాడంట... వాడు బాగా రాసాడు అని వాడిని ఎంకరేజ్ చేస్తే భావుండేది.... నన్ను డిస్కరేజ్ చెయ్యటం మాత్రం భాలేదు.... తిడతారు అని చెప్పి ఫ్లాప్ ని హిట్ అని చెప్పలేం కదా ...

తిరిగి వచేటప్పుడు, నేను నా కోచింగ్ ఫ్రెండ్ పక్కనే కూర్చున్నాం. మా ముందు సీట్లో పద్దు కూర్చుంది. ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు<wbr> వింటూ .... ఆ ఇద్దరు మిత్రులు మేమే అనుకుంటూ... నూటొక్క జిల్లాల్లో పద్దు లాంటి అమ్మాయి లేదు అనుకుంటూ వస్తున్నాము... ఇంతలొ పిడుగులా పద్దు పర్సు నా కాళ్ళ ముందు పడింది. తీసి చూస్తే, తినటానికి ఒక చాకొలేట్, తీసుకోవటానికి ఆరు వందల నోట్లు కనిపించాయి. పనికిరాని వన్ని పర్సు లో పెట్టేసి పద్దుకి వాపసు ఇచ్చేసా. నా టీ-షర్టుకి పాకెట్ లేకపోవటం వల్ల , నావి ఏడు వందలు, పద్దువి ఆరు వందలు కలిపి మొత్తం పదమూడు వందలు నా ఫ్రెండ్ పాకెట్ లోకి వెళ్ళాయి. ఆ తర్వాత నేను నిద్ర పోయాను.

మా ప్లేస్ కి పది కిలోమీటర్ల దూరం లో నా ప్రక్కన కూర్చున్న ఫ్రెండ్ దిగిపోవటానికి నన్ను నిద్ర లేపాడు. వాడు అక్కడ ఇంకో బస్ ఎక్కి వేరే వూరు వెళ్ళాలి. వాడికి బై చెప్పి మళ్ళి పడుకున్నా. మా కోచింగ్ సెంటర్ కి వచ్చాక, హాస్టల్ వాళ్ళు అంతా వెళ్ళిపోవటానికి రెడీ అవుతూ హడావిడగా వుంది. మధ్య మధ్య లో పద్దు కనిపించి నవ్వుతుంది.ఫ్రెండ్ చేంజ్ అడిగితే పాకెట్ లోకి చెయ్యి పెట్టా.... పద్దు ఎందుకు నవ్వుతుందో అప్పుడు అర్థం అయ్యింది. నా మనీ అండ్ పద్దు మనీ కూడా మా ఫ్రెండ్ దగ్గర వుండిపోయాయి.పక్కన వున్న ఫ్రెండ్స్ కి స్టొరీ మొత్తం చెప్పటం కన్నా తనకే చెప్పటం మంచిదని పద్దు వద్ద కు వెళ్ళా.

నన్ను తంతుందో, తిడుతుందో అనుకున్నా... తను మాత్రం నవ్వుతుంది....ఆ టైం లో కూడా తను నవ్వటం నాకు నచ్చింది, అందుకే నేను తన స్మైల్ తిరిగి ఇవ్వలేదు.....తనతో నేను అప్పటి వరకు అసలు మాట్లాడలేదు.మొదటి సారి మొహమాటంగా " డబ్బులు వున్నాయా" అని అడిగా... తను నవ్వుతు డెబ్బయి రూపాయిలు చూపిం<wbr>చింది. అందులో యాబయి రూపాయిలు తీసుకుని నలబై నిమిషాల్లో వస్తా అన్నాను... తను " ఈ ఇరవై రుపాయిలతో ఇంటికి వెళ్లిపోవచ్చు" అంది. నేను వచ్చాక, మీరు వెళ్ళొచ్చు అని సైగ చేసి అక్కడనుంచి నేను బస్సు స్టాప్ కి వెళ్ళాను.

నా ఫ్రెండ్ చాల మంచివాడు అని నాకు నమ్మకం... ఆ నమ్మకమే వాడు వాళ్ళ వూరు వెళ్ళకుండా మధ్యలో దిగిన వూరిలోనే మూడు గంటలు నాకోసం బస్ స్టాప్ లోనే వెయిట్ చేస్తాడని ఆశ కలిగించింది. కట్ చేస్తే, 20 నిమిషాల తర్వాత ఆ వూరి బస్ స్టాప్ లో దిగాను.... అప్పటికే ఆకలితో అరటి పళ్ళు తింటున్న వాడిని చూసి చాల ఆనంద పడ్డాను.. వాడికి నా భాద మొత్తం చెప్పి తేలిక పడ్డాను..వాడి దగ్గర డబ్బులు తీసుకుని, తను నేను వెళ్ళేవరకు వుంటుందో వెళ్ళిపోతుందో అని కొంచం టెన్షన్ పడ్డాను... అలా పడుతూ, లేస్తూ వెళ్లి తన డబ్బులతో పాటు వీడ్కోలు కూడా ఇచ్చాను.. నేను బై చెప్పాను అనుకున్నా.... కాని నాకు తరువాత తెలిసింది అది గుడ్ బై అని.

It remains one of the unforgettable funny incident in my life.Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7318634243543500551.post-65197023353352565212009-05-16T02:30:00.001+05:302009-05-25T20:29:15.640+05:30One day @Bangalore' డాన్స్ పే ఛాన్స్ మార్ లే ' అన్న సౌండ్ విని నాకు మెలకువ రావటం, నేను కంగారు పడటం ఒకే సారి జరిగాయి...... నేను కంగారు పడింది నిద్ర లేచినందుకు కాదు ... నా అలారం టోన్ ఎందుకు మారింది అని.... అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది .... ఆ వచ్చే సాంగ్ నా మొబైల్ నుంచి కాదు MTv నుంచి అని.... ఐనా నేను ఏడింటికి పెట్టుకున్న అలారం ఏడు సార్లు మోగకుండా నిద్ర లేవటం ఎందుకు లే అని మల్లి పడుకున్నా. అలా పడుకుని రెండు నిమషాలు కూడా కాలేదు, మా పక్కింటి వాళ్ళు మోటార్ వెయ్యటం, మా బావ బాత్రూం నుంచి బయటకు రావటం ఒకే సారి జరగటం తో ఆ మోటార్ సౌండ్ , మా బావ షాంపూ స్మెల్ తో నేను నిద్రపోలేను లే అని లేవటానికి డిసైడ్ అయ్యా . అసలు మా పక్కింటి వాళ్ళు వాటర్ కోసం మోటార్ వేస్తారో లేక మమ్మల్ని నిద్ర లేపటం కోసం వేస్తారో అర్థం కాదు.....

ఇంజనీరింగ్ చేసాక GATE రాయని వాళ్ళు అన్నా.... ఇంట్లోకి వచ్చాక GATE వేసేవాళ్ళు అన్నా మా బావకు చాల చిరాకు అందుకే బాత్ రూం డోర్ వెయ్యకుండానే వెళ్తున్నాడు.....అందుకే బాత్ రూం వైపు చెయ్యి చూపి, డోర్ క్లోజ్ చెయ్యి బావ అన్నా...వాడు బెడ్రూం డోర్ క్లోజ్ చేసి హల్లోకి వెళ్ళాడు.మా బావ కి బ్రెయిన్ లో 2 parts వున్నాయి . Left part has nothing left in it and Right part has nothing right in It. అందుకే నేను లేచి..డోర్ క్లోజ్ చేసి...దేవునికి ప్రే చేసి...బ్రష్ కి పేస్టు వేసి...ఫ్యాన్ ఆఫ్ చేసి...ఇంటికి వచ్చిన ఈనాడు పేపర్ చూసి...బాత్ రూం లోకి దూరాను.

నేను రెడీ అయ్యి, కాళ్ళకి షూస్ వేసుకుంటున్నా, మా ఇంకో రూం మేట్ ఏదో సెటైర్ వేసాడు, వాడికి ఎదురు సెటైర్ వస్తే ఇంకా నేను రిటైర్ అయ్యే వరకు వదలడు అని తెలిసి, ఒక చిన్న స్మైల్ ఇచ్చి, రూం నుంచి బయటకి వచ్చాను. ఎందుకంటే మా వాడు ప్రాస కోసం ప్రాణాలు ఇస్తాడు.... వాడి ప్రాణాలు అనుకుంటున్నారేమో .... ప్రక్కనున్న వాడి ప్రాణాలు.

2 ఇల్లు తర్వాత ఒక ఇంటి ముందు ఒక చిన్న పాప స్కూల్ కి రెడీ అయ్యి బస్సు కోసం వెయిట్ చేస్తుంది...ఒక టర్న్ తీసుకుని మార్థహళ్లి మెయిన్ రోడ్ లోకి వచ్చేసరికి అక్కడ ఒక అబ్బాయి(ఇంటర్ అనుకుంట) కాలేజీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు....... కొంచం ముందుకు నడిచేసరికి అక్కడ మా ఫ్రెండ్ TCS బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు.... స్కూల్ నుంచి కాలేజీ కి దాని తర్వాత ఆఫీసు కి ... వయసు మారినా, బస్సు కోసం వెయిటింగ్ మారలేదు.

ఆఫీసు కి వచ్హాక ఒక అందమైన అమ్మాయి కనిపించింది... పైన పేస్ చూసి భావుంది అనుకున్నా.. కింద కాళ్ళు చూసి అసలు భాలేదు అనుకున్నా....నేను భాలేదు అనుకున్నది ఆమె కాళ్ళు కాదు .... ఆ కాళ్ళకి మెట్లు వుండటం...అంతలో ఆ అమ్మాయికి సారీ అంటి కి కాల్ వచ్చింది... మేరా నెంబర్ కబ్ ఆయేగా(ఇంకో అమ్మాయి మొబైల్లో ) అనుకుంటూ నా ప్లేసుకి వెళ్ళా.... మా పక్క టీం వాడు కనిపించాడు.... వాడికి ఆఫీసు పని అంటే కష్టం.. ఆఫీసు మనీ అంటే ఇష్టం.... వాడి వల్ల ఆఫీసు కి మాత్రం చాల నష్టం.... ఆఫీసు కి అంటే అదేదో అడవికి వెళ్ళిన టైపు లో వస్తాడు....

సిస్టం ఆన్ చేసి, ఆఫీసు మెయిల్స్ చెక్ చేస్తున్నా... మా టీం మేట్స్ వచ్చి టిఫ్ఫెన్ కి పిలిచారు..... మా బ్రహ్మాచారుల బాచ్ లో ఒక సంసారి కూడా వస్తున్నాడు.. ఎప్పుడు ఇంట్లో టిఫ్ఫెన్ చేసే వాడు మాతో ఎందుకు వస్తున్నాడో తెలియలేదు.... ఇంట్లో మీ ఆవిడ కొట్టిందా అని అడిగాడు ఒకడు...ఒక స్మైల్ ఇచ్చి , ఈరోజు లేట్గ లేచాము అని చెప్పాడు తను .... తనని చూస్తే సంసార సాగరం లో ఎదురు ఈదుతున్నడమో అనిపించేది..ఈరోజు చూస్తే ఈదలేక కొట్టుకు పోతున్నాడు అనిపించింది.

కాఫెటేరియా కి వెళ్లి పొంగల్ తీసుకుని తిందామని కూర్చున్నా... వాడు రైస్ లో డాల్డా వేసాడో లేక డాల్డా లో రైస్ వేసాడో అర్థం కాలేదు కాని పొంగల్ లో డాల్డా చాల ఎక్కువ అయ్యింది అని అర్థం అయ్యింది ....తింటే పొట్ట ఆకారం పెరుగుతుంది... తినకపోతే పొట్టలో ఆకలి పెరుగుతుంది.. దేనిని పెంచాలా ? అని ఆలోచిస్తున్నా...ఇంతలొ మధ్యానం పార్టీ వుంది అని ఒకడు గుర్తు చేసాడు... ఐతే ఆకలి ని పెంచుదాం అని డిసైడ్ అయ్యాను.

క్యుబికల్‌కి వచ్చి కుర్చుని కోడింగ్ చెయ్యటం స్టార్ట్ చేశా... లంచ్ కి వేళాయెరా అని మా ఫ్రెండ్ పింగ్ చేసాడు.. అదే టైం లో పార్టీ కి ఎక్కడకి వెళ్ళాలి అని డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.... KFC,PizzaHut,Village ఇలా చాల అలోచించి చివరకి పిజ్జాహుట్ అని డిసైడ్ చేసారు... నాకు ఇండియా లో పిజ్జా అంటే అసలు ఇష్టం వుండదు.... అసలే చాలా ఆకలిగా వుంది కాని తప్పదు అని వెళ్ళాము. పిజ్జా బాయ్ ఆర్డర్ తీసుకుని 18 minutes 45 seconds కి ఆర్డర్ సర్వ్ చేస్తాము అని చెప్పి వెళ్ళాడు. కొంచం టైం తర్వాత పిజ్జా వచ్చింది, అది ఒక పీస్ తిన్నాక నాకు అలుపు వచ్చింది.... పిజ్జా ని బాయిల్ చేసే తీసుకువచ్చాడా అని ఒక డౌట్ కూడా వచ్చింది. దానిని సాగదీస్తే చక్రవాకం సీరియల్ కన్నా ఎక్కువ లేన్ఘ్ట్ వచ్చేలా వుంది. ఈ పిజ్జా కష్టాలు అయ్యిన తర్వాత మల్లి ఆఫీసు కి వచ్చాము.

వర్క్ చెయ్యటం స్టార్ట్ చేసాము. నాకు మా ఆఫీసు లో Onsites తర్వాత బాగా నచ్చే విషయం అంటే అది వర్క్. ఎవరో చేసిన తప్పుల్ని సరి చెయ్యటం కన్నా, నేను తప్పులు చేసే ఛాన్స్ వచ్చింది(Bug fixing కాకుండా , new platform development లో వున్నాము).... టీ టైం అని మా ఫ్రెండ్స్ కాఫెటేరియా కి పిలిచారు.... ఒక జ్యూస్ ఆర్డర్ చేసి తాగుతూ మా ఫ్రెండ్స్ డిస్కషన్ ని ఎంజాయ్ చేస్తున్నా...

ఇంతలొ Sasken లో వర్క్ చేసే ఫ్రెండ్ కాల్ చేసింది. తనతో మాట్లాడుతూ వుండగా తను మధ్యలో తుమ్మి, వెంటనే సాస్కెన్ అంది.... నాకు అర్థం కాకా సాస్కెన్ అన్నావ్ ఏంటి అని అడిగా..... తను wipro లో చేస్తున్నా , Sasken లో చేస్తున్నా తుమ్మినప్పుడు మాత్రం Satyam అనే అనాలా ? అందుకే ఈరోజు నుంచి తుమ్మినప్పుడు Sasken అందామని డిసైడ్ అయ్యా అంది. నాకు మైండ్ బ్లాక్ అయ్యి తనలోనే పోకిరి మహేష్ బాబు కనిపించాడు.కొంచం సేపు మాట్లాడాక హాచ్ వాడు నన్ను కరుణించాడు ..... సిగ్నల్ కట్ చేసాడు.

మా ఫ్రెండ్స్ ఈరోజు పాలిటిక్స్ గురుంచి డిస్కషన్ చేస్తున్నారు.... అది ఎలాగు నాకు అవుట్ అఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి , నా ఏరియా అఫ్ ఇంట్రెస్ట్ లో ఎవరైనా మంచి తెలుగు అమ్మాయిలు కనపడతారేమో అని సెర్చ్ చేస్తున్నా.... ఇంతలొ నేను ఒక అమ్మాయిని చూడటం అది చూసి మా ఫ్రెండ్ తనని నాకు సిస్టర్ ని చెయ్యటం జరిగాయి..... మా ఫ్రెండ్స్ పొలిటికల్ డిస్కషన్ మాత్రం ఒక్క ఇంచ్ కూడా జరగలేదు.కొంచం సేపటి తర్వాత మల్లి వర్క్ చెయ్యటం స్టార్ట్ చేసాము....

కొంచం సేపటి తర్వాత ఈరోజు ఫ్రైడే అని గుర్తు వచ్చింది...చలో అని ఆఫీసు నుంచి రూం కి వచ్చా..హలో అని మా ఇంటి నుంచి కాల్ వచ్చింది...మా అమ్మ మాట్లాడుతూ ౩ ప్రశ్నలు అడిగింది, ఆ తర్వాత మా నాన్న కూడా అవే ౩ ప్రశ్నలు అడిగారు....మా అక్కకి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టాను... మా అక్క కూడా అదే ౩ ప్రశ్నలు అడిగింది.... తర్వాత మా బావ కూడా అవే ౩ ప్రశ్నలు అడిగారు..... మా అక్క వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ పడ్డాడు అంట... వాడితో మాట్లాడమని అక్క ఫోన్ వాడికి ఇచ్చింది...ప్రక్క నుంచి అక్క డబ్బింగ్ చెప్తుంటే వీడు కూడా అవే ౩ ప్రశ్నలు అడిగాడు ... రాజు మామ ఎలా వున్నావు ? ... భోజనం చేసావా ? .... ఘంటసాల ఎప్పుడు వస్తున్నావు ?... ౩ ప్రశ్నకు సమాధానం చెప్తూ వుండగా , వాళ్ళ తమ్ముడు వీడి సైకిల్ తీస్తున్నాడు అని ఫోన్ అక్కకి ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు....

బాత్ రూం లో బాత్ చేసి ..... భగిని రెస్టారెంట్ లో భోజనం చేసి.....మా టీవీలో మూవీ చూసి..... ఫోన్ లో ఫ్రెండ్స్ కి కాల్ చేసి.....watch లో టైం చూసి .... అలారం ఆఫ్ చేసి.... దేవునికి ప్రే చేసి... పడుకున్నా...Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7318634243543500551.post-26085891372088494772009-05-15T13:53:00.001+05:302011-04-28T19:23:53.730+05:30నా గురుంచి
హాయ్ .... నా పేరు నాగరాజు ... ఇంజనీరింగ్ చేసి బెంగలూరు లో ఒక మంచి (?) సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తున్నా. ఎప్పుడు లేజీ గ వుంటూ అప్పుడప్పుడు యాక్టివ్ గ వుండటం నాకు అలవాటు.... ఫ్రెండ్స్ దీనిని బద్ధకం అని పిలిస్తే .... అదేదో MIT or Stanford లో Ph.D సర్టిఫికేట్ లా ఫీల్ అయ్యిపోవటం నాకు వున్న మరో మంచి (?) అలవాటు.

ఇంకా నా గురుంచి చెప్పమంటే .......I like to take the life as it comes... Trust in God.....Believe in my self...respecting others as i respect myself.

If i lost my money , then i feel "i lost nothing".

If i lost my time , then i feel "i lost something precious".

If i lost my character, then there is nothing that i have with me.

At any cost i don't want to lose my character.I never want to impose my feelings on anybody. And i can be more comfortable if they let me live as i wish.

అప్పుడు ఎప్పుడో చిన్నపుడు ఆర్కుట్ లో రాసిన 'నా గురుంచి' ని కాపీ చేసి పేస్టు చేశా.... ఇంగ్లీష్ లో వుంది అని ఏమి అనుకోకండి ... ప్రస్తుతం నేను లేజీ మోడ్ వున్నా.

గొప్పగా చెప్పుకునే అలవాట్లు ఐతే ఏమి లేవు..... నిద్ర పోవటం ... మ్యూజిక్ వినటం... గేమ్స్ ఆడటం లేదా చూడటం... నేను ఇష్టం గా చేసే పనులు.

క్రికెట్ లో సచిన్ కి నా కన్నా మంచి అభిమాని ఎవరు వుండరు అని నాకో ఎదవ నమ్మకం( నాకు వున్న కొరియా ఫ్రెండ్ కి మన దేశం లో వున్న గొప్ప వ్యక్తుల్లో(బ్రతికి వున్న వాళ్ళలో) ౩ పేర్లు చెప్పమంటే ....సచిన్ .... అబ్దుల్ కలాం... రెహమాన్ అని చెప్పా..... నిజానికి ౩ సార్లు సచిన్ అని చెప్పి నా అభిమానాన్ని చూపిద్దాం అనుకున్నా.... కాని క్రికెట్ గురుంచి తెలియని వాడి దగ్గర ఎందుకులే అని అలా చెప్పా)... అప్పుడప్పుడు షటిల్ ఎప్పుడన్నా చెస్ అండ్ కార్రోమ్స్ ఆడుతూ వుంటా..

సినిమాలు చూడటం తక్కువే.... నాగార్జున నా అభిమాన హీరో అండ్ పవన్ అంటే కొంచం సాఫ్ట్ కార్నెర్ ...... త్రివిక్రం అండ్ శేఖర్ కమ్మల మూవీస్ మాత్రం మిస్ అవ్వకుండా చూస్తా....

Nagarajuhttp://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.com2